ప్రపంచకప్ లో డకౌట్ల రికార్డు
విండీస్ పై కివీ ఓపెనర్ల గోల్డెన్ డక్ గప్టిల్, మన్రోలను డకౌట్ చేసిన కోట్రెల్ 2015 ప్రపంచకప్ లో శ్రీలంక ఓపెనర్ల గోల్డెన్ డక్ ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో మ్యాచ్ మ్యాచ్ కూ పలు అరుదైన రికార్డులు వచ్చి చేరుతున్నాయి. సెంచరీల బాదుడులో మాత్రమే కాదు..డౌకట్లలోనూ రికార్డులు నమోదయ్యాయి. ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా వెస్టిండీస్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన కీలక రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లో…కివీ ఓపెనర్లు ఇద్దరూ […]
- విండీస్ పై కివీ ఓపెనర్ల గోల్డెన్ డక్
- గప్టిల్, మన్రోలను డకౌట్ చేసిన కోట్రెల్
- 2015 ప్రపంచకప్ లో శ్రీలంక ఓపెనర్ల గోల్డెన్ డక్
ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో మ్యాచ్ మ్యాచ్ కూ పలు అరుదైన రికార్డులు వచ్చి చేరుతున్నాయి.
సెంచరీల బాదుడులో మాత్రమే కాదు..డౌకట్లలోనూ రికార్డులు నమోదయ్యాయి. ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా వెస్టిండీస్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన కీలక రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లో…కివీ ఓపెనర్లు ఇద్దరూ తమ ఖాతా తెరవకుండానే డకౌట్ గా వెనుదిరిగారు.
అంతేకాదు…అదే ఓవర్ 5వ బంతికి మరో ఓపెనర్ కోలిన్ మన్రో సైతం దొరికిపోయాడు. కోట్రెల్ బౌలింగ్ లోనే క్లీన్ బౌల్డ్ గా డకౌటయ్యాడు.
ప్రస్తుత ప్రపంచకప్ లో ఇద్దరు ఓపెనర్లు ఒక్క పరుగూ చేయకుండానే డకౌట్ గా తొలి ఓవర్లోనే అవుట్ కావడం ఇదే మొదటిసారి. అయితే..నాలుగున్నర దశాబ్దాల ప్రపంచకప్ చరిత్రలో ఓపెనర్లు గోల్డెన్ డక్ గా వెనుదిరగడం ఇది రెండోసారి మాత్రమే.
నాలుగేళ్ల క్రితం ముగిసిన 2015 ప్రపంచకప్ లో…అప్ఘనిస్థాన్ తో ముగిసిన మ్యాచ్ లో శ్రీలంక ఓపెనర్లు లాహిరూ తిరుమానే, తిలకరత్నే దిల్షాన్ పరుగులేవీ చేయకుండానే అవుటయ్యారు.
తిరుమానేను దౌలత్ జడ్రాన్, దిల్షాన్ ను షాపూర్ జడ్రాన్ అవుట్ చేయటం విశేషం.