శంషాబాద్ లో నకిలీ వీసాల ఏజెంట్లు అరెస్ట్
గల్ఫ్ దేశాలతో సహా విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నకిలీ వీసాలు సృష్టించి అమాయకులను దోచుకుంటున్న ఏజెంట్లను శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని పలు జిల్లాలలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ కొందరిని నమ్మించి వారి వద్ద లక్షల రూపాయలు వసూలు చేసి నకిలీ వీసాలు సృష్టించిన నలుగురు ఏజెంట్లు…. కొందరు అమాయకులను గల్ఫ్ దేశాలకు పంపించేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. వారి వీసాలను పరిశీలించిన విమానాశ్రయ అధికారులు అవి నకిలీవని తేల్చి పోలీసులకు విషయం తెలిపారు. దీంతో […]
గల్ఫ్ దేశాలతో సహా విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నకిలీ వీసాలు సృష్టించి అమాయకులను దోచుకుంటున్న ఏజెంట్లను శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణలోని పలు జిల్లాలలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ కొందరిని నమ్మించి వారి వద్ద లక్షల రూపాయలు వసూలు చేసి నకిలీ వీసాలు సృష్టించిన నలుగురు ఏజెంట్లు…. కొందరు అమాయకులను గల్ఫ్ దేశాలకు పంపించేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. వారి వీసాలను పరిశీలించిన విమానాశ్రయ అధికారులు అవి నకిలీవని తేల్చి పోలీసులకు విషయం తెలిపారు.
దీంతో శంషాబాద్ పోలీసులు నకిలీ వీసాలు తయారు చేసిన, అమాయకులను మోసం చేస్తున్న నలుగురు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు.
ఇలా నకిలీ వీసాలతో పలువురిని మోసం చేసిన ఏజెంట్లపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు శంషాబాద్ పోలీసులు చెప్పారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచే కాకుండా ముంబాయి నుంచి, విశాఖపట్నం నుంచి కూడా నకిలీ వీసాలతో గల్ఫ్ దేశాలకు పంపించేందుకు గతంలో కొందరు ఏజెంట్లు ప్రయత్నం చేశారు.
ముంబైలోనూ, హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలోను ఇలాంటి నకిలీ ఏజెంట్లను గతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నకిలీ వీసాల మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా ఏజెంట్లు మాత్రం నానాటికీ పెరిగిపోతూనే ఉన్నారని పోలీసులే చెబుతున్నారు.
దీనిని దృష్టిలో ఉంచుకునే శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేసిన నలుగురు నకిలీ వీసాల ఏజెంట్లపై పీడీ యాక్ట్ ప్రయోగించినట్లు పోలీసులు చెబుతున్నారు.
నకిలీ వీసా ఏజెంట్లను అదుపులోకి తీసుకోవడంతో పాటు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో వీరి బారిన పడకుండా ఉండేందుకు ప్రజలను అప్రమత్తం చేయాలని కూడా పోలీసులు భావిస్తున్నారు.