ప్రపంచకప్ లో షమీ హ్యాట్రిక్ షో

1987లో చేతన్ శర్మ…2019లో మహ్మద్ షమీ 2019 ప్రపంచకప్ లో షమీకి తొలి హ్యాట్రిక్  అప్ఘనిస్థాన్ పై ఆఖరి ఓవర్లో షమీ మ్యాజిక్ భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ…2019 ప్రపంచకప్ లో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్ గా రికార్డుల్లో చేరాడు. సౌతాంప్టన్ లోని హాంప్ షైర్ బౌల్ వేదికగా అప్ఘనిస్థాన్ తో ముగిసిన రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లో ఈ ఘనతను సొంతం చేసుకొన్నాడు. పసికూన అప్ఘనిస్థాన్ తో ఆఖరి ఓవర్ వరకూ సస్పెన్స్ […]

Advertisement
Update:2019-06-23 05:30 IST
  • 1987లో చేతన్ శర్మ…2019లో మహ్మద్ షమీ
  • 2019 ప్రపంచకప్ లో షమీకి తొలి హ్యాట్రిక్
  • అప్ఘనిస్థాన్ పై ఆఖరి ఓవర్లో షమీ మ్యాజిక్

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ…2019 ప్రపంచకప్ లో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్ గా రికార్డుల్లో చేరాడు. సౌతాంప్టన్ లోని హాంప్ షైర్ బౌల్ వేదికగా అప్ఘనిస్థాన్ తో ముగిసిన రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లో ఈ ఘనతను సొంతం చేసుకొన్నాడు.

పసికూన అప్ఘనిస్థాన్ తో ఆఖరి ఓవర్ వరకూ సస్పెన్స్ థ్రిల్లర్లా సాగిన ఈ పోరులో షమీ చెలరేగిపోయాడు. మ్యాచ్ నెగ్గాలంటే ఆఖరి ఓవర్ ఆరుబాల్స్ లో 16 పరుగులు చేయాల్సిన అఫ్ఘనిస్థాన్ ను షమీ కుప్పకూల్చాడు.

అప్ఘన్ హాఫ్ సెంచరీ హీరో నబీని..హార్ధిక్ పాండ్యా క్యాచ్ ద్వారా పడగొట్టిన షమీ…ఆ తర్వాతి రెండుబాల్స్ లో టెయిల్ ఎండర్లు అప్తాబ్ అలం, ముజీబుర్ రెహ్మాన్ లను యార్కర్ బాల్స్ తో క్లీన్ బౌల్డ్ చేసి…హ్యాట్రిక్ పూర్తి చేశాడు.

నాలుగున్నర దశాబ్దాల ప్రపంచకప్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన భారత రెండో బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు.

1987 ప్రపంచకప్ లో చేతన్ శర్మ..

భారత్ వేదికగా 1987లో జరిగిన రిలయన్స్ ప్రపంచకప్ లో భాగంగా నాగపూర్ వేదికగా న్యూజిలాండ్ పై పేస్ బౌలర్ చేతన్ శర్మ.. తొలి హ్యాట్రిక్ సాధించాడు. ప్రపంచకప్ లో మొట్టమొదటి హ్యాట్రిక్ నమోదు చేసిన బౌలర్ గా, భారత తొలి పేసర్ గా
నిలిచాడు.

ఆ తర్వాత నాలుగుదశాబ్దాల విరామం తర్వాత… 2019 ప్రపంచకప్ లో తొలి హ్యాట్రిక్ సాధించిన బౌలర్ గా మహ్మద్ షమీ రికార్డుల్లో చేరాడు.

Tags:    
Advertisement

Similar News