అమ్మ ఒడి ఎఫెక్ట్... ప్రభుత్వ స్కూల్స్ లో ‘నో వేకన్సీ బ్యానర్లు’

కొత్త ప్రభుత్వం ప్రకటించిన అమ్మ ఒడి పథకం అప్పుడే ప్రభావం చూపుతోంది. ప్రభుత్వ పాఠశాలకు పిల్లలు పోటెత్తుతున్నారు. అమ్మ ఒడి కింద 15వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ ఒడి బాట పట్టిస్తున్నారు. ఏపీలో చాలా చోట్ల ప్రభుత్వ స్కూళ్లల్లో అడ్మిషన్లు నిండిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తమ పాఠశాలలో సీట్లు లేవు అంటూ బ్యానర్లు పెట్టేస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఒడి కారణంగా స్కూల్‌ నిండిపోయింది. […]

Advertisement
Update:2019-06-23 09:36 IST

కొత్త ప్రభుత్వం ప్రకటించిన అమ్మ ఒడి పథకం అప్పుడే ప్రభావం చూపుతోంది. ప్రభుత్వ పాఠశాలకు పిల్లలు పోటెత్తుతున్నారు. అమ్మ ఒడి కింద 15వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ ఒడి బాట పట్టిస్తున్నారు.

ఏపీలో చాలా చోట్ల ప్రభుత్వ స్కూళ్లల్లో అడ్మిషన్లు నిండిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తమ పాఠశాలలో సీట్లు లేవు అంటూ బ్యానర్లు పెట్టేస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఒడి కారణంగా స్కూల్‌ నిండిపోయింది.

ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం స్థానిక నేతలతో తల్లిదండ్రులు రెకమెండేషన్‌ కూడా చేయిస్తున్నారు. ఈ తాకిడి తట్టుకోలేక ఇలా బ్యానర్ పెట్టేశారు. సీట్లు అయిపోయాయి… రెకమెండేషన్లు చేయించి ఇబ్బంది పెట్టవద్దంటూ ప్రభుత్వ స్కూల్‌కు బ్యానర్‌ కట్టారు.

Tags:    
Advertisement

Similar News