జగన్ సీఎం కావొచ్చు... నాకు తెలియకుండా ఫొటో పెడతారా...
ఎన్నికల్లో ఓడిపోయినా సరే టీడీపీ నేతల ఊపు మాత్రం తగ్గడం లేదు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫొటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టేందుకు కూడా టీడీపీ నేతలు తమ అనుమతి తప్పనిసరి అంటున్నారు. విజయవాడ కార్పొరేషన్ లో ఫొటోల అంశం వైసీపీ, టీడీపీ మేయర్ ల మధ్య పెద్ద రగడకు కారణమైంది. విజయవాడ కార్పొరేషన్ లో చంద్రబాబు, ఎన్టీఆర్ ఫొటోలను తొలగించిన అధికారులు… ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫొటోను ఉంచారు. దాంతో మేయర్ కోనేరు శ్రీధర్‌కు […]
ఎన్నికల్లో ఓడిపోయినా సరే టీడీపీ నేతల ఊపు మాత్రం తగ్గడం లేదు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫొటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టేందుకు కూడా టీడీపీ నేతలు తమ అనుమతి తప్పనిసరి అంటున్నారు. విజయవాడ కార్పొరేషన్ లో ఫొటోల అంశం వైసీపీ, టీడీపీ మేయర్ ల మధ్య పెద్ద రగడకు కారణమైంది.
విజయవాడ కార్పొరేషన్ లో చంద్రబాబు, ఎన్టీఆర్ ఫొటోలను తొలగించిన అధికారులు… ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫొటోను ఉంచారు. దాంతో మేయర్ కోనేరు శ్రీధర్‌కు చిర్రెత్తుకొచ్చింది. తన అనుమతి లేకుండా సీఎం ఫొటో ఎలా పెడతారంటూ రంకేలేశారు.
దీంతో వైసీపీ కార్పొరేటర్లు రంగంలోకి దిగారు. అధికారులకు అండగా నిలబడ్డారు. ముఖ్యమంత్రి కాబట్టే జగన్ మోహన్ రెడ్డి ఫొటో పెట్టి చంద్రబాబు ఫొటోను తొలగించారని వైసీపీ కార్పొరేటర్లు వాదించారు. మరి ఎన్టీఆర్ ఫొటో ఎందుకు తీసేశారంటూ మేయర్ ఎదురుదాడి చేశారు. ఎన్టీఆర్ ఫొటో పెట్టేందుకు అంగీకరించిన వైసీపీ కార్పొరేటర్లు అదే సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటో కూడా పెట్టాలని కోరారు. అందుకు టీడీపీ మేయర్ అంగీకరించలేదు. ఎన్టీఆర్ ఫొటో మాత్రమే పెడతామని… వైఎస్‌ఆర్ ఫొటో పెట్టనివ్వనని గొడవపడ్డారు.
దీంతో వైసీపీ కార్పొరేటర్లు మేయర్ తీరుపై మండిపడ్డారు. మేయర్ విచక్షణ కోల్పోయారని… ఎన్టీఆర్ ఫొటో పెట్టేందుకు తాము అంగీకరించినా… వైఎస్ ఫొటో పెట్టేందుకు మేయర్ ఎందుకు అంగీకరించడం లేదని నిలదీశారు. ఇద్దరూ దివంగత నేతలే కదా అని ప్రశ్నించారు. టీడీపీ వాళ్లకు ఎన్టీఆర్ ఎంతో… తమకు వైఎస్‌ఆర్ కూడా అంతే అని వైసీపీ కార్పొరేటర్లు చెబుతున్నారు. మేయర్ ఏకపక్ష తీరుపై అధికారులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.