వర్షం వర్షం.... హర్షం హర్షం....

నాలుగు చినుకులు పడ్డాయి. తెలుగు రాష్ట్రాలు పులకించాయి. నిప్పులు కురిపించిన ఆకాశం నాలుగు చినుకులు చిలకరించి తెలుగు ప్రజలకు ఆనందాన్ని నింపింది. మూడు నెలలు వణికించిన ఎండలకు నైరుతి తన రాకతో సమాధానం చెప్పింది. ఇంతకుముందు ఎన్నడూ లేనట్లుగా ఎండలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. మూడు నెలల పాటు తెలుగు ప్రజలు ఎండల తీవ్రత కు అల్లాడిపోయారు. నెర్రలు వారిన భూమిని చూస్తూ రైతులు కంటతడి పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురవాలంటూ యజ్ఞాలు, యాగాలు […]

Advertisement
Update:2019-06-22 02:15 IST

నాలుగు చినుకులు పడ్డాయి. తెలుగు రాష్ట్రాలు పులకించాయి. నిప్పులు కురిపించిన ఆకాశం నాలుగు చినుకులు చిలకరించి తెలుగు ప్రజలకు ఆనందాన్ని నింపింది.

మూడు నెలలు వణికించిన ఎండలకు నైరుతి తన రాకతో సమాధానం చెప్పింది. ఇంతకుముందు ఎన్నడూ లేనట్లుగా ఎండలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. మూడు నెలల పాటు తెలుగు ప్రజలు ఎండల తీవ్రత కు అల్లాడిపోయారు. నెర్రలు వారిన భూమిని చూస్తూ రైతులు కంటతడి పెట్టుకున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురవాలంటూ యజ్ఞాలు, యాగాలు చేశారు. మూఢనమ్మకమే అయినా కొన్ని చోట్ల కప్పలకు పెళ్లిళ్లు చేశారు. శుక్రవారం సాయంత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి.

ఈనెల 8న ప్రవేశించాల్సిన నైరుతి రుతుపవనాలు పది రోజులు ఆలస్యంగా తెలుగు రాష్ట్రాలలోకి ప్రవేశించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లతో సహా తమిళనాడు, కర్ణాటక, ఒడిసా, మహారాష్ట్రాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసాయి. శనివారం కూడా తెలుగు రాష్ట్రాలలో సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో రైతులు ఏరువాకకు సిద్ధమయ్యారు. గడచిన మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాలలో అనేక జిల్లాల్లో రైతులు ఏరువాక సంబరాలు చేసుకున్నారు. విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకుంటున్నారు.

ఈ ఏడాది వ్యవసాయం కష్టమేమో అని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతున్న ఈ సమయంలో నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలలోకి ప్రవేశించి వర్షాలు కురవడం ప్రారంభమైంది.

ఈ వర్షాలతో రైతుల కళ్ళల్లో ఆనందం నిండింది. మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడం రైతులలో ఆనందాన్ని నింపింది. వాతావరణం చల్లబడడంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోను ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News