టీమంత్రివర్గం ఎప్పుడు? హరీష్ ఖాయమేనా?

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు.? ఇప్పుడు అందరినోటా ఇదే ప్రశ్న. ఎందుకంటే కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం పూర్తయ్యింది. ఇప్పుడు పాలనపై దృష్టి పెట్టబోతున్నారు కేసీఆర్. ఇందులో మంత్రుల పాత్ర చాలా కీలకం. అందుకే ఇప్పుడు మంత్రివిస్తరణ చేయబోతున్నారా అనే ప్రశ్న తలెత్తుతోంది. తెలంగాణ మంత్రివర్గంలో పోయిన ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన కేటీఆర్, హరీష్ రావులు ఈ కొత్త ప్రభుత్వంలో లేరు. కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. ఇక హరీష్ ఉట్టి ఎమ్మెల్యేనే.. ఎన్నికలు.. […]

Advertisement
Update:2019-06-22 07:36 IST

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు.? ఇప్పుడు అందరినోటా ఇదే ప్రశ్న. ఎందుకంటే కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం పూర్తయ్యింది. ఇప్పుడు పాలనపై దృష్టి పెట్టబోతున్నారు కేసీఆర్. ఇందులో మంత్రుల పాత్ర చాలా కీలకం. అందుకే ఇప్పుడు మంత్రివిస్తరణ చేయబోతున్నారా అనే ప్రశ్న తలెత్తుతోంది.

తెలంగాణ మంత్రివర్గంలో పోయిన ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన కేటీఆర్, హరీష్ రావులు ఈ కొత్త ప్రభుత్వంలో లేరు. కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. ఇక హరీష్ ఉట్టి ఎమ్మెల్యేనే.. ఎన్నికలు.. కోడ్ అమలు కారణంగా వీరిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు కేసీఆర్. ఇప్పుడు వీరిద్దరినీ చేర్చుకొని కీలక శాఖలు ఇచ్చి మళ్లీ పాలనను పరుగులు పెట్టిస్తారని అందరూ నమ్ముతున్నారు.

హరీష్ రావును మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం.. ఒక్క స్త్రీ కి కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడంపై తెలంగాణ వ్యాప్తంగా అసంతృప్తి నెలకొంది. టీఆర్ఎస్ అభిమానులు కూడా హరీష్ కు అన్యాయం జరిగిందని లోలోపల బాధపడుతున్నారు. ప్రతీ సందర్భంలోనూ హరీష్ లేడంటూ ఎలుగెత్తి చాటుతున్నారు.

అందుకే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో మేనల్లుడు హరీష్ రావును కేసీఆర్ తీసుకుంటారా.? తిరిగి జలవనరుల శాఖను అప్పగిస్తారా? లేదా అన్నది టీఆర్ఎస్ పొలిటికల్ వర్గాల్లో హాట్ చర్చకు దారితీసింది.

Tags:    
Advertisement

Similar News