గంటాతో పాటు జంపింగ్ ఎమ్మెల్యేలు వీరేనా?

మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌ రావు… టీడీపీని నిట్టనిలువునా చీల్చే పనిలో ఉన్నారని కథనాలు వస్తున్నాయి. ఆంగ్ల మీడియాలో కూడా ఇదే తరహా కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం శ్రీలంకలో విహరిస్తున్న గంటా శ్రీనివాస్‌రావు… బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉన్నట్టు చెబుతున్నారు. ఫిరాయింపుల చట్టం నుంచి తప్పించుకునేందుకు అవసరమైన సంఖ్యలో ఎమ్మెల్యేలను కూడగట్టి ఆ తర్వాతే ఫిరాయించేందుకు బీజేపీ, గంటా బృందం ప్రణాళిక రచిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే ఆ బృందానికి ఏపీ అసెంబ్లీలో గంటా శ్రీనివాసే నాయకత్వం వహిస్తారని.. […]

Advertisement
Update:2019-06-22 07:38 IST

మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌ రావు… టీడీపీని నిట్టనిలువునా చీల్చే పనిలో ఉన్నారని కథనాలు వస్తున్నాయి. ఆంగ్ల మీడియాలో కూడా ఇదే తరహా కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం శ్రీలంకలో విహరిస్తున్న గంటా శ్రీనివాస్‌రావు… బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉన్నట్టు చెబుతున్నారు. ఫిరాయింపుల చట్టం నుంచి తప్పించుకునేందుకు అవసరమైన సంఖ్యలో ఎమ్మెల్యేలను కూడగట్టి ఆ తర్వాతే ఫిరాయించేందుకు బీజేపీ, గంటా బృందం ప్రణాళిక రచిస్తున్నారు.

ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే ఆ బృందానికి ఏపీ అసెంబ్లీలో గంటా శ్రీనివాసే నాయకత్వం వహిస్తారని.. ఆ తర్వాత బీజేపీ మరింత బలపడితే గంటా కూడా పెద్ద నాయకుడు అవుతారని బీజేపీ నేతలు చెబుతున్నారు. గంటాతో పాటు ఫిరాయించే వారి జాబితాలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, రేపల్లె ఎమ్మెల్యే అన్నంగి సత్యప్రసాద్, కొండేపి ఎమ్మెల్యే వీరాంజనేయస్వామి, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

అయితే ప్రస్తుతానికి గంటా శ్రీనివాస్ మాత్రం ఫిరాయింపు అంశాన్ని తోసిపుచ్చుతున్నారు. 15 మంది ఎమ్మెల్యేలతో కలిసి తాను బీజేపీలో చేరుతున్న వార్తల్లో నిజం లేదంటున్నారు. చంద్రబాబే తనకు మార్గదర్శకుడని చెప్పారు. టీడీపీతోనే తన రాజకీయ ప్రయాణం కొనసాగుతుందని చెప్పారు. అయితే ఇప్పటికే పలుమార్లు జంపింగ్‌లు చేసిన గంటా శ్రీనివాస్‌ మరోసారి బీజేపీలో చేరినా ఆశ్చర్యం ఏమీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    
Advertisement

Similar News