ఆ పార్టీ నుంచి రాజ్యసభకు వెళితే అటు నుంచి అటే...
టీడీపీకి ఆగస్ట్ సంక్షోభం ఒక్కటే కాదు. ఇంకా కొన్ని సెంటిమెంట్లు ఆ పార్టీకి ఉన్నాయి. ఆ పార్టీ నుంచి ఎవరూ రాజ్యసభకు వెళ్లినా ఆ పార్టీలో ఉండడం మాత్రం ఖాయం కాదు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తోంది. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు జమానా వరకు ఈ సెంటిమెంట్ రిపీట్ అవుతోంది. టీడీపీ నుంచి రాజ్యసభకు వెళ్లిన వారు ఎవరూ పదవీకాలం ముగిసిన తర్వాతయైనా….లేదా పదవిలో ఉన్నప్పుడు ఆపార్టీకి గుడ్‌బై చెప్పడం జరుగుతోంది. టీడీపీ రాజ్యసభకు పంపిస్తే […]
టీడీపీకి ఆగస్ట్ సంక్షోభం ఒక్కటే కాదు. ఇంకా కొన్ని సెంటిమెంట్లు ఆ పార్టీకి ఉన్నాయి. ఆ పార్టీ నుంచి ఎవరూ రాజ్యసభకు వెళ్లినా ఆ పార్టీలో ఉండడం మాత్రం ఖాయం కాదు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తోంది. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు జమానా వరకు ఈ సెంటిమెంట్ రిపీట్ అవుతోంది.
టీడీపీ నుంచి రాజ్యసభకు వెళ్లిన వారు ఎవరూ పదవీకాలం ముగిసిన తర్వాతయైనా….లేదా పదవిలో ఉన్నప్పుడు ఆపార్టీకి గుడ్‌బై చెప్పడం జరుగుతోంది. టీడీపీ రాజ్యసభకు పంపిస్తే వాళ్లు పార్టీలో ఉండరన్న సెంటిమెంట్ ప్రతీసారీ రిపీట్ అవుతోంది.
టీడీపీ నుంచి రాజ్యసభకు వెళ్లినవారిలో రేణుకా చౌదరి, సి.రామచంద్రయ్య, మోహన్ బాబు, జయప్రద, మైసూరారెడ్డి, వంగా గీత, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, యలమంచిలి శివాజీ, రామచంద్రారెడ్డి, రుమాండ్ల రామచంద్రయ్య ఉన్నారు. వీరంతా ఆతర్వాత ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వేరే పార్టీలో చేరారు. ఇలా ఓ పదిహేను మంది పదవిలో వుండగానో లేదా ఆ తర్వాతో పార్టీకి దూరమైనవాళ్లే.
తాజాగా సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహనరావు పార్టీ మారారు, దీంతో మరోసారి ఈ సెంటిమెంట్ రిపీట్ అయింది.