అమ్మ ఒడిపై మళ్లీ గందరగోళం లేపిన మంత్రి
అమ్మ ఒడి పథకంపై ఏపీ ప్రభుత్వంలోని మంత్రులే భిన్న ప్రకటనలు చేస్తూ గందరగోళం రేపుతున్నారు. అమ్మ ఒడి కేవలం ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే వర్తింప చేస్తామని ఆర్థిక మంత్రి బుగ్గన ఇటీవల స్పష్టత ఇచ్చారు. ఏపీ విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి కూడా అమ్మ ఒడి పథకాన్ని ప్రైవేట్ స్కూళ్లు ప్రచారం చేసుకుంటే వెంటనే స్కూళ్లను సీజ్ చేయాలని ఆదేశించారు. మంత్రి బుగ్గన ప్రకటన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం పోటీ ఏర్పడింది. భారీగా ప్రభుత్వ స్కూళ్ల […]
అమ్మ ఒడి పథకంపై ఏపీ ప్రభుత్వంలోని మంత్రులే భిన్న ప్రకటనలు చేస్తూ గందరగోళం రేపుతున్నారు. అమ్మ ఒడి కేవలం ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే వర్తింప చేస్తామని ఆర్థిక మంత్రి బుగ్గన ఇటీవల స్పష్టత ఇచ్చారు. ఏపీ విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి కూడా అమ్మ ఒడి పథకాన్ని ప్రైవేట్ స్కూళ్లు ప్రచారం చేసుకుంటే వెంటనే స్కూళ్లను సీజ్ చేయాలని ఆదేశించారు.
మంత్రి బుగ్గన ప్రకటన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం పోటీ ఏర్పడింది. భారీగా ప్రభుత్వ స్కూళ్ల వైపు విద్యార్థులు మళ్లుతున్నారు. అయితే ఇప్పుడు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి అమ్మ ఒడిపై బుగ్గన ప్రకటనకు భిన్నంగా ప్రకటన చేశారు.
అమ్మ ఒడి పథకాన్ని కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తింప చేయాలని ప్రజలు, మేధావులు పెద్దెత్తున డిమాండ్ చేస్తుంటే… మంత్రి సురేష్ మాత్రం అమ్మ ఒడి పథకాన్ని ప్రైవేట్ స్కూళ్లకు వర్తింపచేయాలని స్కూళ్ల యాజమాన్యాలు, ప్రజలు కోరుతున్నారని ప్రకటించారు. త్వరలో దీనిపై సీఎం స్పష్టత ఇస్తారని మంత్రి ప్రకటించారు.
బుగ్గన ప్రకటన తర్వాత అమ్మ ఒడి పథకంపై గందరగోళానికి తెరపడిందని భావిస్తున్న వేళ ఇప్పుడు విద్యా శాఖ మంత్రే అమ్మ ఒడి ప్రైవేట్ స్కూళ్లకు వర్తింప చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పడంతో మరోసారి ఈ అంశంపై గందరగోళం రేగే సూచనలున్నాయి.