సోషల్ మీడియా దెబ్బకు దిగివచ్చిన వీహెచ్‌ ...

కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ సోషల్ మీడియా దెబ్బ రుచేంటో చూశారు. ఇటీవల హైదరాబాద్ పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తా అంటూ వీహెచ్‌ హడావుడి చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న వైఎస్ విగ్రహానికి తాడు కట్టి లాగేందుకు ప్రయత్నించినట్టు ఉన్న వీడియో బయటకు వచ్చింది. దాంతో వీహెచ్‌పై వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో దండయాత్ర మొదలుపెట్టారు. వీహెచ్‌ను ఉతికేస్తున్నారు. చివరకు వీహెచ్‌ దిగి వచ్చి వివరణ ఇచ్చుకున్నారు. తాను వైఎస్ విగ్రహాన్ని కూల్చేందుకు ప్రయత్నించానన్న […]

Advertisement
Update:2019-06-20 03:30 IST

కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ సోషల్ మీడియా దెబ్బ రుచేంటో చూశారు. ఇటీవల హైదరాబాద్ పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తా అంటూ వీహెచ్‌ హడావుడి చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న వైఎస్ విగ్రహానికి తాడు కట్టి లాగేందుకు ప్రయత్నించినట్టు ఉన్న వీడియో బయటకు వచ్చింది. దాంతో వీహెచ్‌పై వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో దండయాత్ర మొదలుపెట్టారు. వీహెచ్‌ను ఉతికేస్తున్నారు. చివరకు వీహెచ్‌ దిగి వచ్చి వివరణ ఇచ్చుకున్నారు.

తాను వైఎస్ విగ్రహాన్ని కూల్చేందుకు ప్రయత్నించానన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తాను వైఎస్‌ విగ్రహాన్ని కూల్చేందుకు ప్రయత్నించలేదని వివరణ ఇచ్చారు. తాను అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు మాత్రమే ప్రయత్నించానని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిని చేసిందే తానని వీహెచ్ చెప్పుకొచ్చారు.

పార్టీలో చాలా మంది వ్యతిరేకించినా వైఎస్‌ను పీసీసీ అధ్యక్షుడిని చేసింది తానేనని… అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఎందుకు కూలుస్తానని వీహెచ్ ప్రశ్నించారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతానని వీహెచ్ ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News