పోలవరానికి జగన్.... అధికారుల గుండెల్లో గన్...!

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మక భారీ నీటి పారుదల ప్రాజెక్టు… పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు సందర్శించనున్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లడం ఇదే తొలిసారి. గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టులో అంతులేని అవినీతి జరిగిందని, అంచనాలకు మించి టెండర్లను కట్టపెట్టారంటూ అప్పటి ప్రతిపక్షం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తాము అధికారంలోకి వస్తే పోలవరం పనులపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని, అవసరమైతే […]

Advertisement
Update:2019-06-20 02:59 IST

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మక భారీ నీటి పారుదల ప్రాజెక్టు… పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు సందర్శించనున్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లడం ఇదే తొలిసారి.

గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టులో అంతులేని అవినీతి జరిగిందని, అంచనాలకు మించి టెండర్లను కట్టపెట్టారంటూ అప్పటి ప్రతిపక్షం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తాము అధికారంలోకి వస్తే పోలవరం పనులపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని, అవసరమైతే టెండర్లను రీకాల్ చేస్తామని కూడా ప్రకటించారు.

ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రస్తుత టెండర్లపై సమీక్షలు నిర్వహించడంతో పాటు…. కొత్తగా పిలిచే టెండర్లని పరిశీలించేందుకు జ్యుడీషియల్ కమిషన్ కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా కలిసారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు ముఖ్యమంత్రి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుపై కాగ్ కూడా అవినీతి జరిగిందంటూ తన వార్షిక నివేదికలో పేర్కొనడం విశేషం.

పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని నీటి పారుదల శాఖ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పోలవరం పనుల్లో జరిగిన అవినీతి, అక్రమాలు వెలుగులోకి వస్తే ఎవరెవరిపై ఎలాంటి చర్యలుంటాయోననే భయం అధికారులను నీడలా వెంటాడుతోంది.

గురువారం ఉదయం పోలవరం వెళ్లి అక్కడి పనులను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలిస్తారు. అనంతరం కాంట్రాక్టర్లతోను, అధికారులతోను విడివిడిగా సమావేశం అవుతారు.

ఇప్పటికే బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అళ్ల నాని, నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.

ఇక్కడ జరుగుతున్న పనులను పూర్తి స్ధాయిలో సమీక్షిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags:    
Advertisement

Similar News