తెలంగాణ రెడ్లు ఉన్నది అందుకే....
తెలంగాణ కాంగ్రెస్ లో అసహనం పెరిగిపోతోంది. అందుకే అందరూ బయటపడుతున్నారు. కాంగ్రెస్ వరుసగా పదేళ్లు ప్రతిపక్షంలో ఉండడం.. కేంద్రంలో కూడా ఈసారి అధికారం చేపట్టలేకపోవడంతో వారంతా తమ ఆవేదనను బహిరంగంగానే వ్యక్త పరుస్తున్నారు. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం , కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో రాజకీయంగా రాయలసీమ రెడ్లు సత్తా చాటారని….. కానీ తెలంగాణ రెడ్లు మాత్రం రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారని దామోదర […]
తెలంగాణ కాంగ్రెస్ లో అసహనం పెరిగిపోతోంది. అందుకే అందరూ బయటపడుతున్నారు. కాంగ్రెస్ వరుసగా పదేళ్లు ప్రతిపక్షంలో ఉండడం.. కేంద్రంలో కూడా ఈసారి అధికారం చేపట్టలేకపోవడంతో వారంతా తమ ఆవేదనను బహిరంగంగానే వ్యక్త పరుస్తున్నారు.
తాజాగా మాజీ డిప్యూటీ సీఎం , కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో రాజకీయంగా రాయలసీమ రెడ్లు సత్తా చాటారని….. కానీ తెలంగాణ రెడ్లు మాత్రం రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారని దామోదర రాజనర్సింహా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో ఇప్పుడు రెడ్లు అధికారంలోకి వచ్చారని.. కానీ తెలంగాణలో రెడ్లు సక్సెస్ కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ తీరు చూసైనా తెలంగాణలో రెడ్లు ఎదగాలని ఆయన హితవు పలికారు.
తెలంగాణలోనూ వైఎస్ జగన్ ను ఉదహరిస్తూ దామోదర రాజనర్సింహ మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. జగన్ లాగా ప్రజా సమస్యలపై పోరాటం చేయకపోవడం.. ప్రజా ఉద్యమాలు నిర్మించకపోవడమే కాంగ్రెస్ తెలంగాణలో బలపడలేక పోవడానికి కారణమని దామోదర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి నేతలు కేవలం అధికారం వస్తే అనుభవిస్తారని.. కానీ పార్టీ కోసం కృషి చేయరని దామోదర పరోక్షంగా విమర్శలు గుప్పించడం సంచలనంగా మారింది.
ఇలా కాంగ్రెస్ అధికారానికి దూరం కావడం.. పక్క రాష్ట్రంలో ఇదే కాంగ్రెస్ నుంచి బయటపడ్డ వైసీపీ రెడ్డి సామాజికవర్గం నేత వైఎస్ జగన్ అధికారంలోకి రావడంతో తెలంగాణ రెడ్లపై ఒత్తిడి పెరిగిపోతోంది. దామోదర విమర్శలు చూశాక ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వంలోని రెడ్లు ఎలా స్పందిస్తారనేది వేచిచూడాలి.