ప్రపంచకప్ లో రోహిత్ రెండో సెంచరీ
పాక్ పై శతకంబాదిన భారత రెండో క్రికెటర్ విరాట్ కొహ్లీ సరసన రోహిత్ శర్మ భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ…2019 వన్డే ప్రపంచకప్ లో రెండో సెంచరీ సాధించాడు. మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ముగిసిన నాలుగోరౌండ్ మ్యాచ్ లో రోహిత్ మూడంకెల స్కోరు సాధించాడు. యువఆటగాడు రాహుల్ తో కలసి భారత ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ మొదటి వికెట్ కు 136 పరుగుల భాగస్వామ్యం నమోదు […]
- పాక్ పై శతకంబాదిన భారత రెండో క్రికెటర్
- విరాట్ కొహ్లీ సరసన రోహిత్ శర్మ
భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ…2019 వన్డే ప్రపంచకప్ లో రెండో సెంచరీ సాధించాడు. మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ముగిసిన నాలుగోరౌండ్ మ్యాచ్ లో రోహిత్ మూడంకెల స్కోరు సాధించాడు.
యువఆటగాడు రాహుల్ తో కలసి భారత ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ మొదటి వికెట్ కు 136 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు.
మొత్తం 113 బాల్స్ లో 3 సిక్సర్లు, 14 బౌండ్రీలతో 140 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. 84 బాల్స్ లోనే వంద పరుగులు సాధించిన రోహిత్… కేవలం 34 బాల్స్ లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించడం కూడా రికార్డుగా నిలిచింది.
ప్రస్తుత ప్రపంచకప్ లో…సౌతాఫ్రికా పై 122 పరుగులతో తొలిశతకం బాదిన రోహిత్…చిరకాల ప్రత్యర్థి పాక్ పై రెండో సెంచరీ సాధించాడు.
2015లో కొహ్లీ…2019లో రోహిత్…
పాకిస్థాన్ ప్రత్యర్థిగా ప్రపంచకప్ లో శతకం బాదిన రెండో భారత క్రికెటర్ ఘనతను రోహిత్ శర్మ సొంతం చేసుకొన్నాడు. 2015 ప్రపంచకప్ లో.. పాక్ పై విరాట్ కొహ్లీ సెంచరీ సాధించడం ద్వారా …భారత తొలి క్రికెటర్ గా నిలిచాడు.
పాక్ తో జరిగిన ప్రస్తుత మ్యాచ్ వరకూ…తన కెరియర్ లో 209 వన్డేలు ఆడిన రోహిత్ శర్మకు…24 సెంచరీలు, 42 హాఫ్ సెంచరీలతో సహా..8వేల 300కు పైగా పరుగులు సాధించిన రికార్డు ఉంది.