ఇక సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్

తెలంగాణలో ఉన్న సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇన్నాళ్ళూ చెక్ పవర్‌కు దూరంగా ఉన్న వీళ్లకు ఇకపై కొత్త పవర్ రానుంది. సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు ఇకపై చెక్ పవర్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రామ పంచాయితీల్లో ఆడిటింగ్ బాధ్యతలు కూడా సర్పంచ్‌తో కలిపి పంచాయితీ కార్యదర్శులకు అప్పగించారు. ఇటీవల కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కొత్త పంచాయితీరాజ్ చట్టానికి ఆమోదం తెలిపారు. అది తెలంగాణ అసెంబ్లీలో చట్టంగా రూపొందనుంది. […]

Advertisement
Update:2019-06-16 02:28 IST

తెలంగాణలో ఉన్న సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇన్నాళ్ళూ చెక్ పవర్‌కు దూరంగా ఉన్న వీళ్లకు ఇకపై కొత్త పవర్ రానుంది. సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు ఇకపై చెక్ పవర్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

గ్రామ పంచాయితీల్లో ఆడిటింగ్ బాధ్యతలు కూడా సర్పంచ్‌తో కలిపి పంచాయితీ కార్యదర్శులకు అప్పగించారు. ఇటీవల కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కొత్త పంచాయితీరాజ్ చట్టానికి ఆమోదం తెలిపారు. అది తెలంగాణ అసెంబ్లీలో చట్టంగా రూపొందనుంది. ఆ చట్టం పూర్తి స్థాయిలో ఆమోదం పొందాక పైన తెలిపిన పవర్స్ అన్నీ అమలులోకి రానున్నాయి.

పంచాయతీ రాజ్‌ చట్టం-2018లోని చెక్‌ పవర్‌కు సంబంధించి సెక్షన్లను ప్రభుత్వం తాజాగా నోటిఫై చేసింది. దీని ప్రకారం గ్రామపంచాయతీ నిధులకు సంబంధించి ఇద్దరికీ సంయుక్తంగా చెక్‌ పవర్‌ లభిస్తుంది.

అసెంబ్లీలో ఆమోదానికంటే ముందే ఆర్డినెన్సు జారీ చేయనుండటంతో ఈ నెల 17 నుంచి సర్పంచ్‌లకు ఈ చెక్‌పవర్‌ అమల్లోకి రానుంది.

Tags:    
Advertisement

Similar News