బరితెగింపే.... కొంపముంచిందా?
నిన్న అసెంబ్లీలో గత స్పీకర్ల గురించి అంతా మాట్లాడుకున్నారు…. ఎక్కడా కోడెల ఊసే లేదు. చివరకు టీడీపీ వాళ్ళు కూడా కోడెల ప్రస్తావనే తీసుకు రాలేదు…. కోడెల ఓడిపోయినప్పటి నుంచి ఆయన మీద, ఆయన కుటుంబం మీద కేసులు పెట్టడానికి జనం క్యూ కడుతున్నారు. ప్రభుత్వం మారింది కాబట్టి కక్ష కొద్దీ అధికారంలో ఉన్నవాళ్లు కేసులు పెట్టిస్తున్నారా? అంటే అదీ కాదు… కోడెల మీద ఫిర్యాదు చేసేవాళ్ళల్లో ఎక్కువ మంది తెలుగుదేశం నాయకులే. కోడెల ఇలాంటి దుస్థితికి […]
నిన్న అసెంబ్లీలో గత స్పీకర్ల గురించి అంతా మాట్లాడుకున్నారు…. ఎక్కడా కోడెల ఊసే లేదు. చివరకు టీడీపీ వాళ్ళు కూడా కోడెల ప్రస్తావనే తీసుకు రాలేదు…. కోడెల ఓడిపోయినప్పటి నుంచి ఆయన మీద, ఆయన కుటుంబం మీద కేసులు పెట్టడానికి జనం క్యూ కడుతున్నారు. ప్రభుత్వం మారింది కాబట్టి కక్ష కొద్దీ అధికారంలో ఉన్నవాళ్లు కేసులు పెట్టిస్తున్నారా? అంటే అదీ కాదు… కోడెల మీద ఫిర్యాదు చేసేవాళ్ళల్లో ఎక్కువ మంది తెలుగుదేశం నాయకులే. కోడెల ఇలాంటి దుస్థితికి ఎందుకు వచ్చాడు?
రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి అత్యంత వివాదాస్పద వ్యక్తి కోడెల శివప్రసాద రావు. కోడె దూడ దూకుడు. అయితే ఎవరెవరితో సన్నిహితంగా ఉంటే రాజకీయాల్లో సక్సెస్ కావొచ్చో బాగా తెలిసిన వ్యక్తి. అందుకే కొందరు మీడియా బాసులకు అత్యంత ఆత్మీయుడు. పదవులకోసం అటునుంచి నరుక్కు వచ్చిన సందర్భాలెన్నో.
ఎన్నికల సందర్భంగా ఆయన ఇంట్లో ప్రమాదవశాత్తు బాంబులు పేలినా…. ప్రాణ భయం ఉందని రక్షణ కోరిన వంగవీటి రంగ హత్య ఈయన హోం మినిస్టర్‌గా ఉన్నప్పుడు జరిగినా…. ఇదంతా పార్టీకోసం కోడెల చేసిన సేవగా తెలుగుదేశం శ్రేణులు భావించాయి.
ఆయన అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికైనా…. ఏం మారలేదు…. పార్టీ కార్యకర్తగానే పనిచేశాడు. స్పీకర్ గా ఉంటూ విదేశాలకు వెళ్ళినప్పుడు తెలుగుదేశం తరపున ప్రచారం చేశాడు. ఇక గుంటూరు జిల్లాలో అయితే పచ్చ చొక్కా వేసుకుని మరీ ప్రచారం చేశాడు.
23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, అందులో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి చంద్రబాబు శాసనసభ పరువు తీసినా…. కోడెల అభ్యంతరం చెప్పలేదు సరికదా…. అందుకు మరింత సహాయ పడ్డాడు. కోర్టులు ఎత్తిచూపినా ఏం సిగ్గుపడలేదు.
శాసనసభలో ప్రతిపక్షనాయకుడికి మైక్ ఇచ్చినట్టే ఇచ్చి…. మాటకొకసారి మైక్ కట్ చేస్తూ…. అధికార పక్షం చేత నానామాటలు అనిపించి…. నానా తిట్లూ తిట్టించి…. తాను గబ్బు పట్టడమే కాకుండా సభాపతి స్థానానికి కళంకం తెచ్చాడు.
ఇంత నీచంగా సభను నడిపిన మరో స్పీకర్ చరిత్రలో ఉండకపోవచ్చు. అయితే ఇదంతా పార్టీకోసం కోడెల చేసిన సేవగా తెలుగుదేశం శ్రేణులు భావించాయి. అయితే చంద్రబాబు ఘోర ఓటమిలో చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళ పాత్ర ఎంత ఉందో…. కోడెల పాత్ర కూడా అంతకన్నా తక్కువ ఏమీ లేదు.
రాజకీయనాయకుడిగా ఇంత కశ్మలంలో మునిగితేలిన కోడెల ప్రజలతో ఏమైనా బాగున్నాడా అంటే…. కొద్దిమంది అనుచరులతో తప్ప మిగిలిన తెలుగుదేశం నాయకుల దగ్గర కూడా కోడెల టాక్స్ వసూలు చేసిన ఘనత…. ఈయనది, ఈయన కొడుకూ, కూతురిది.
కోడలిని వేధించిన తీరు, స్త్రీల పట్ల…. కారు షెడ్ లో ఉండాలి…. ఆడది ఇంట్లో ఉండాలి… అంటూ చేసిన కామెంట్లు అతని కుసంస్కారాన్ని ప్రజలకు చెప్పకనే చెప్పాయి.
టోటల్ గా కోడెల ఎంత చెడ్డ పేరు తెచ్చుకున్నాడంటే…. నిన్న అసెంబ్లీలో మంచి స్పీకర్‌ల గురించి మాట్లాడుతూ తెలుగుదేశం నాయకులు ఒక్కరు కూడా కోడెల ప్రస్తావన తీసుకురాలేదు. పైగా పరోక్షంగా కోడెల లాగా వ్యవహరించ వద్దని కొత్త స్పీకర్ ను అందరూ కోరారు.
స్పీకర్ స్థానంలో ఉండి ఇంత దారుణంగా వ్యవహరించింది పార్టీకోసమే కదా… పైవాళ్ళు చెప్పినట్టే చేశాను కదా! అని కోడెల భావిస్తే…. ఆయన నన్ను వాడుకుని వదిలేశాడు అని పశ్చాత్తాప పడితే …. అది నిజమే కావచ్చు కానీ అన్నింటిలోనూ అంత అతి చేసి సాధించింది ఏమిటి? పరువు పోవడం తప్ప…!
పదవిలో ఉన్నప్పుడు చేసిన అతి తో పాటు…. వసూళ్ళలోనూ అతి చేయడం వల్లే ఆయన ఇబ్బందుల్లో పడ్డారని అంతా అనుకుంటున్నారు.