చంద్రబాబు చేసిన పెద్ద తప్పు ఇదేనట....
చంద్రబాబు చేసిన తప్పుల్లో కాంగ్రెస్ తో కలవడం ఒకటని రాజకీయ విశ్లేషకులు ఓ అంచనాకు వచ్చాయి. అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రస్థాయి నాయకుల సమీక్షలో కూడా కాంగ్రెస్ తో కలవడం ఆయన చేసిన పెద్ద తప్పుగా నాయకులు అభివర్ణించారట. దీంతో చంద్రబాబు ఇక భవిష్యత్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా.. అలాంటి టీడీపీ అధినేత బాబు.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలవడం.. చెట్టాపట్టాలేసుకొని తిరగడం.. […]
చంద్రబాబు చేసిన తప్పుల్లో కాంగ్రెస్ తో కలవడం ఒకటని రాజకీయ విశ్లేషకులు ఓ అంచనాకు వచ్చాయి. అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రస్థాయి నాయకుల సమీక్షలో కూడా కాంగ్రెస్ తో కలవడం ఆయన చేసిన పెద్ద తప్పుగా నాయకులు అభివర్ణించారట. దీంతో చంద్రబాబు ఇక భవిష్యత్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.
టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా.. అలాంటి టీడీపీ అధినేత బాబు.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలవడం.. చెట్టాపట్టాలేసుకొని తిరగడం.. ఏపీ ప్రజల్లో మానసికంగా కొంత వ్యతిరేక భావం పెంచింది. ఇక వైసీపీ కూడా దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. అది కూడా ఓటమికి కారణంగా నేతలు అభివర్ణిస్తున్నారు.
అందుకే తాజా సమీక్షలో చంద్రబాబు ఇక జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ కు, రాహుల్ గాంధీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు సమాచారం. భవిష్యత్ లో అప్పటి రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేయాలని డిసైడ్ అయినట్టు సమాచారం.
అయితే కొంత మంది తిరిగి బీజేపీతో స్నేహం చేస్తే బెటర్ అన్న ఆలోచనను పంచుకున్నట్టు తెలిసింది. కానీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి ఎన్నికల వేళ చంద్రబాబు అన్ని రాష్ట్రాలకు తిరిగి ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడానికి చేసిన రచ్చను మరిచిపోని మోడీ, షాలు బాబును దగ్గరకు రానిచ్చే పరిస్థితి లేదు. అందుకే ప్రస్తుతానికి సైలెంట్ గా ఉండడమే మేలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.