అదే దృశ్యం.... అదే స్థలం....

సేమ్ కార్డ్.. బట్ నేమ్స్ చేంజ్.. ఇది ఓ సినిమాలో ప్రముఖ డైలాగ్. ఇరవై ఏళ్ల క్రితం సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు పలికిన ఈ డైలాగ్ తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికీ ప్రజల నోట్లో నానుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా ఇలాంటిదే జరిగింది. కానీ సేమ్ సీన్.. నేమ్స్ చేంజ్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న శాసనసభ సమావేశాలను టీవీలో చూసిన వారికి 2004 సంవత్సరంలో ముఖ్యమంత్రి స్థానంలో రాజశేఖర్ రెడ్డి కూర్చోవడం, ప్రతిపక్ష నాయకుని […]

Advertisement
Update:2019-06-14 05:58 IST

సేమ్ కార్డ్.. బట్ నేమ్స్ చేంజ్.. ఇది ఓ సినిమాలో ప్రముఖ డైలాగ్. ఇరవై ఏళ్ల క్రితం సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు పలికిన ఈ డైలాగ్ తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికీ ప్రజల నోట్లో నానుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా ఇలాంటిదే జరిగింది. కానీ సేమ్ సీన్.. నేమ్స్ చేంజ్ అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న శాసనసభ సమావేశాలను టీవీలో చూసిన వారికి 2004 సంవత్సరంలో ముఖ్యమంత్రి స్థానంలో రాజశేఖర్ రెడ్డి కూర్చోవడం, ప్రతిపక్ష నాయకుని స్థానంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూర్చోవడం గుర్తుకు వచ్చిందంటున్నారు.

15 సంవత్సరాల నాటి సీన్ రిపీట్ అయినా… ఈసారి మాత్రం సీఎం స్థానంలో వై.యస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూర్చున్నారు. ఇదొక్కటే కాదు.. ఆనాడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎలా చిరునవ్వులు చిందించారో… గురువారం నాటి శాసనసభ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూంటే అలాంటి చిరునవ్వులు చిందించారని చెబుతున్నారు.

2004వ సంవత్సరంలో వైయస్ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రజలు తమకు ఎంతటి విజయాన్ని కట్టబెట్టారో శాసనసభలో సీఎంగా ఆయన ప్రకటించారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ముఖం కోపంగా, ఆగ్రహంగా పెట్టుకుని తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే ప్రతిపక్ష నేతను ఉద్దేశించి వైయస్ రాజశేఖర్ రెడ్డి.. “కాస్త నవ్వండి చంద్రబాబు నాయుడు గారు..” అంటూ వ్యాఖ్యానించారు.

గురువారం శాసనసభలో కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. తన నుంచి తీసుకున్న ఎమ్మెల్యే, ఎంపీల సంఖ్య ఎంత ఉందో తెలుగుదేశం పార్టీకి అంతే మంది గెలిచారని, దేవుడు, ప్రజలు ఇంత గొప్పగా స్క్రిప్టు రాసారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ముఖ కవళికలను చూసిన టీవీ ప్రేక్షకులు 2014 లో జరిగిన శాసనసభ సమావేశంలో చంద్రబాబు నాయుడు ముఖ కవళికలకు పోలిక తీసుకువచ్చారు.

అంతే కాదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న సమయంలో తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి చిరునవ్వులు చిందించే నట్లుగా నేటి సీఎం కూడా ముసిముసి నవ్వులు నవ్వారు. ఇదే సేమ్ సిన్…. నేమ్స్ చేంజ్ అంటే…. అని తెలుగు ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News