యూపీలో దారుణం : కవరేజీకి వెళ్లిన జర్నలిస్టు నోటిలో మూత్ర విసర్జన
జర్నలిస్టులపై దాడులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం లాంటి మీడియాపై స్వయంగా ప్రభుత్వం, పోలీసులే దాడులకు పాల్పడుతుండటంతో భయాందోళనలు నెలకొంటున్నాయి. తాజాగా అత్యంత ఘోరమైన సంఘటన యూపీలో చోటు చేసుకుంది. రైలు పట్టాలు తప్పిన ఘటనను కవర్ చేయడానికి వెళ్లిన ఒక జర్నలిస్టును రైల్వే పోలీసులు చితకబాది… లాకప్‌లో అర్థనగ్నంగా ఉంచి హింసించడమే కాక నోటిలో మూత్ర విసర్జన చేసిన ఘటన సంచలనం సృష్టించింది. న్యూస్ 24 […]
జర్నలిస్టులపై దాడులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం లాంటి మీడియాపై స్వయంగా ప్రభుత్వం, పోలీసులే దాడులకు పాల్పడుతుండటంతో భయాందోళనలు నెలకొంటున్నాయి. తాజాగా అత్యంత ఘోరమైన సంఘటన యూపీలో చోటు చేసుకుంది.
రైలు పట్టాలు తప్పిన ఘటనను కవర్ చేయడానికి వెళ్లిన ఒక జర్నలిస్టును రైల్వే పోలీసులు చితకబాది… లాకప్‌లో అర్థనగ్నంగా ఉంచి హింసించడమే కాక నోటిలో మూత్ర విసర్జన చేసిన ఘటన సంచలనం సృష్టించింది.
న్యూస్ 24 అనే న్యూస్ ఛానల్‌కు చెందిన జర్నలిస్టు అమిత్ శర్మ గత రాత్రి యూపీలోని షామ్లీ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదాన్ని కవర్ చేయడానికి వెళ్లాడు. అదే సమయంలో అక్కడ సివిల్ దుస్తుల్లో ఉన్న రైల్వే పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. అతనిపై దాడి చేయడంతో చేతిలో ఉన్న కెమెరా కిందపడింది. దానిని తీసుకోవడానికి కిందకు వంగగానే పోలీసులు మూకుమ్మడిగా దాడి చేసి అత్యంత అవమానకరంగా మాట్లాడుతూ అతడిని తీసుకెళ్లి లాకప్‌లో వేశారు.
రైలు ప్రమాద ఘటన గురించి కెమెరాలో చిత్రీకరిస్తున్నప్పుడు అతని కెమెరాను, సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. ఈ విషయం తెలిసి ఇతర జర్నలిస్టులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అంతే కాకుండా అమిత్ శర్మకు జరిగిన ఘోరం గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అక్కడకు ముందే చేరుకున్న మరికొంత మంది జర్నలిస్టులు అమిత్‌ను పోలీసులు కొడుతున్న దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. సదరు దృశ్యాలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడమే కాకుండా సీనియర్ పోలీస్ అధికారులకు కూడా పిర్యాదు చేశారు.
రాత్రంతా పోలీస్ స్టేషన్ ఎదుట జర్నలిస్టులు ఆందోళన నిర్వహించడంతో అమిత్ శర్మను ఇవాళ ఉదయం పోలీసులు విడుదల చేశారు. అయితే ఇలా జరగడానికి గల అసలు కారణాన్ని అమిత్ శర్మ తర్వాత తోటి జర్నలిస్టుకు చెప్పాడు.
పది రోజుల క్రితం తాను సదరు పోలీసుల మీద ఒక కథనాన్ని చిత్రీకరించానని.. దాన్ని నా సెల్‌ఫోన్‌లో స్టోర్ చేశాను. అప్పుడే వాళ్లు నా ఫోన్ లాక్కున్నారు. దాన్ని మనసులో పెట్టుకుని తిరిగి ఇవాళ ఇలా చేశారని ఆయన చెప్పారు.
ఈ ఘటనను ఉన్నతాధికారులకు పిర్యాదు చేయడంతో సదరు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాకేష్ కుమార్, కానిస్టేబుల్ సంజయ్ పవార్‌ను సస్పెండ్ చేశారు.
గత వారం రోజులుగా ఉత్తర్‌ప్రదేశ్‌లో జర్నలిస్టులపై దాడులు పెరిగిపోవడంపై సర్వత్రా ఆందోళన నెలకొంది.
#WATCH Shamli: GRP personnel thrash a journalist who was covering the goods train derailment near Dhimanpura tonight. He says, "They were in plain clothes. One hit my camera&it fell down. When I picked it up they hit&abused me. I was locked up, stripped&they urinated in my mouth" pic.twitter.com/nS4hiyFF1G
— ANI UP (@ANINewsUP) June 11, 2019