ఏపీఐఐసీ చైర్మన్‌గా రోజా

ఎమ్మెల్యే రోజాని జగన్ ప్రభుత్వంలో కీలక పదవి వరించింది. ప్రస్తుతం వరుసగా రెండో సారి నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆర్కే రోజాకు తొలి మంత్రి వర్గంలోనే చోటు లభిస్తుందని అందరూ భావించారు. అయితే ప్రాంతీయ, సామాజిక సమీకరణాల్లో ఆమెకు తొలి దఫా జగన్ చోటు కల్పించలేక పోయారు. రోజాకు మంత్రి పదవి రాకపోవడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. కొన్ని పత్రికలు ఆమె కినుక వహించాయని కూడా రాశారు. కానీ అనూహ్యంగా నిన్న […]

Advertisement
Update:2019-06-12 10:37 IST

ఎమ్మెల్యే రోజాని జగన్ ప్రభుత్వంలో కీలక పదవి వరించింది. ప్రస్తుతం వరుసగా రెండో సారి నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆర్కే రోజాకు తొలి మంత్రి వర్గంలోనే చోటు లభిస్తుందని అందరూ భావించారు. అయితే ప్రాంతీయ, సామాజిక సమీకరణాల్లో ఆమెకు తొలి దఫా జగన్ చోటు కల్పించలేక పోయారు.

రోజాకు మంత్రి పదవి రాకపోవడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. కొన్ని పత్రికలు ఆమె కినుక వహించాయని కూడా రాశారు. కానీ అనూహ్యంగా నిన్న సాయంత్రం వైఎస్ జగన్ ఆమెను రాజధానికి పిలిపించారు. అప్పుడే తనకు కీలకమైన ఏపీఐఐసీ బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలిపారు. దీనికి రోజా కూడా సానుకూలంగా స్పందించడంతో ఆమెకు ఆ పదవి ఖరారు చేశారు.

ఇవాళో, రేపో సీఎం వైఎస్ జగన్ ఆమెను ఏపీఐఐసీ చైర్ పర్సన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ కానున్నాయి.

Tags:    
Advertisement

Similar News