ఆస్ట్రేలియా 46 ఏళ్ల స్వప్నం ఎట్టకేలకు సాకారం

అప్పుడు మార్గారెట్ కోర్ట్…ఇప్పుడు యాష్లీగీ బార్టీ 2019 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ తో సరికొత్త రికార్డు.. పారిస్ వేదికగా ఇటీవలే ముగిసిన 2019 ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ…ఆస్ట్రేలియా మహిళా టెన్నిస్ కు కొత్త ఊపిరిపోసింది. గత 46 సంవత్సరాలుగా ఎదురుచూసిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ కల ఎట్టకేలకు నెరవేరింది. నాలుగున్నర దశాబ్దాల క్రితం మార్గారెట్ కోర్టు చివరిసారిగా ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా మహిళగా నిలిచింది. ఆ తర్వాత నుంచి ఎందరో కంగారూ ప్లేయర్లు వచ్చినా…టైటిల్ […]

Advertisement
Update:2019-06-12 06:35 IST
  • అప్పుడు మార్గారెట్ కోర్ట్…ఇప్పుడు యాష్లీగీ బార్టీ
  • 2019 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ తో సరికొత్త రికార్డు..

పారిస్ వేదికగా ఇటీవలే ముగిసిన 2019 ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ…ఆస్ట్రేలియా మహిళా టెన్నిస్ కు కొత్త ఊపిరిపోసింది. గత 46 సంవత్సరాలుగా ఎదురుచూసిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ కల ఎట్టకేలకు నెరవేరింది.

నాలుగున్నర దశాబ్దాల క్రితం మార్గారెట్ కోర్టు చివరిసారిగా ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా మహిళగా నిలిచింది. ఆ తర్వాత నుంచి ఎందరో కంగారూ ప్లేయర్లు వచ్చినా…టైటిల్ మాత్రం సాధించలేకపోయారు.

అయితే…ప్రస్తుత 2019 టోర్నీ ద్వారా…ఆస్ట్రేలియా నవతరం ప్లేయర్, 23 ఏళ్ల యాష్లీగీ బార్టీ అందరిఅంచనాలు తలకిందులు చేసి సరికొత్త చాంపియన్ గా అవతరించింది.

70 నిముషాల పాటు సాగిన టైటిల్ సమరంలో చెక్ ప్లేయర్ మార్కెటాను 6-1, 6-3తో చిత్తు చేసి… ట్రోఫీతో పాటు…18 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ చెక్ సైతం అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఆస్ట్రేలియా మహిళలు సైతం గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించగలరని 23 ఏళ్ల బార్టీ చాటి చెప్పింది.

ఫ్రెంచ్ ఓపెన్ విజయంతో బార్టీ ర్యాంక్ సైతం ఏకంగా రెండోస్థానానికి చేరిపోయింది. 2019 గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో బార్టీ సాధించినదే అతిపెద్ద విజయంగా నిలిచిపోతుంది.

Tags:    
Advertisement

Similar News