పవన్ అందుకే ఓడిపోయాడు " రావెల కిషోర్ బాబు
పోతే పోయాడు.. కానీ పోతూపోతూ పవన్ కళ్యాణ్ బండారాన్ని బయటపెట్టేశాడు రావెల. మాజీ మంత్రిగా, సీనియర్ నేతగా ఉన్న రావెల కిషోర్ బాబు మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ నేతలతో విభేదించి మరీ జనసేనలో చేరారు. పోటీచేసి చిత్తుగా ఓడాడు. తాజాగా తిరుపతికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో బీజేపీలో చేరాడు. జనసేన కాడిని వదిలేసి కమలం పంచన చేరాడు. అయితే జనసేనను వీడుతూ తాజాగా గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ…. పవన్ పై సంచలన […]
పోతే పోయాడు.. కానీ పోతూపోతూ పవన్ కళ్యాణ్ బండారాన్ని బయటపెట్టేశాడు రావెల. మాజీ మంత్రిగా, సీనియర్ నేతగా ఉన్న రావెల కిషోర్ బాబు మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ నేతలతో విభేదించి మరీ జనసేనలో చేరారు. పోటీచేసి చిత్తుగా ఓడాడు.
తాజాగా తిరుపతికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో బీజేపీలో చేరాడు. జనసేన కాడిని వదిలేసి కమలం పంచన చేరాడు.
అయితే జనసేనను వీడుతూ తాజాగా గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ…. పవన్ పై సంచలన కామెంట్స్ చేశాడు. పవన్ వైఖరిని తూర్పార బట్టాడు. పవన్ ను కలవడానికి తాను శతవిధాలా ప్రయత్నించినా ఆయన కరుణించలేదన్నాడు. కనీసం తనకు పవన్ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవాడని రావెల ఆవేదన చెందాడు.
తన సలహాలు, సూచనలను ఎప్పుడూ తీసుకోలేదని పేర్కొన్నాడు. కనీసం గౌరవించలేదని ఆరోపించాడు. పవన్ కళ్యాణ్ ఏనాడు రాజకీయాలపై తనతో చర్చించిన దాఖలాలు లేవని మండిపడ్డాడు.
పవన్ ఓటమికి ప్రధాన కారణం ఆయన టీడీపీకి అనుకూలంగా ఉండడమేనని రావెల అభిప్రాయపడ్డాడు. టీడీపీతో జనసేన లోపాయికారి ఒప్పందం చేసుకున్నందు వల్ల ఆ పార్టీ కొంప మునిగిందని.. చంద్రబాబును ఏమీ అనకుండా జగన్ ను తిడుతూ టీడీపీకి అనుకూలంగా పవన్ వ్యవహరించడం వల్లే ఆయన కూడా గెలువలేకపోయాడని విమర్శించాడు.
కాగా రావెల తీరు ఆదినుంచి వివాదాస్పదమే.. టీడీపీలో కూడా ఇలానే నేతలతో తగవు పెట్టుకొని జనసేనలో చేరాడు. తాజాగా జనసేనలో ఓడిపోయాక బీజేపీలో చేరారు. ఇలా పోతూ పోతూ అప్పటి వరకూ ఉన్న పార్టీలను తిట్టడం కామన్ గానే జరిగిపోతోంది. మరి రావెల విమర్శలపై పవన్ ఎలా స్పందిస్తాడన్నది చూడాలి.