ఏపీకి కొత్త గవర్నర్ వస్తున్నారా?
ఏపీ విభజన జరిగి ఐదేళ్లు దాటింది. కేంద్రంలోనే కాదు…. రాష్ట్రంలోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ గవర్నర్ నరసింహన్ మాత్రం కొనసాగుతున్నారు. దాదాపు తొమ్మిదేళ్లు కావస్తోంది. డిసెంబర్ వస్తే పదేళ్లు దాటుతాయి. 2009 డిసెంబర్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా వచ్చారు. తెలంగాణ ప్రకటన తర్వాత రాజుకున్న వేడితో ఈయన్ని కాంగ్రెస్ సర్కార్ గవర్నర్‌గా కొనసాగించింది. రాష్ట్ర విభజనతో పాటు ఆతర్వాత చాలా సంక్షోభ సమయంలో నరసింహన్ కీలకంగా వ్యవహరించారు. పదేళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగిన నరసింహన్ రెస్ట్ […]
ఏపీ విభజన జరిగి ఐదేళ్లు దాటింది. కేంద్రంలోనే కాదు…. రాష్ట్రంలోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ గవర్నర్ నరసింహన్ మాత్రం కొనసాగుతున్నారు. దాదాపు తొమ్మిదేళ్లు కావస్తోంది. డిసెంబర్ వస్తే పదేళ్లు దాటుతాయి. 2009 డిసెంబర్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా వచ్చారు. తెలంగాణ ప్రకటన తర్వాత రాజుకున్న వేడితో ఈయన్ని కాంగ్రెస్ సర్కార్ గవర్నర్‌గా కొనసాగించింది.
రాష్ట్ర విభజనతో పాటు ఆతర్వాత చాలా సంక్షోభ సమయంలో నరసింహన్ కీలకంగా వ్యవహరించారు. పదేళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగిన నరసింహన్ రెస్ట్ కోరుకుంటున్నారని ఓ ప్రచారం జరుగుతోంది. ప్రధానిగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్రమోదీని ఇటీవలే నరసింహన్ కలిశారు. ఈ సందర్భంగా తన మనసులో మాట చెప్పారని తెలుస్తోంది.
తనను ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ బాధ్యతల నుంచి తప్పించాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం కొత్తగా కేంద్ర హోంశాఖ బాధ్యతలు చేపట్టిన అమిత్ షా దృష్టికి కూడా తీసుకెళ్లాలని నరసింహన్ ప్రయత్నించారని అంటున్నారు. ఆయన ఖాళీగా లేకపోవడంతో కుదరలేదని తెలుస్తోంది. దీంతో త్వరలోనే ఢిల్లీకి వెళ్లి కలుస్తారని అంటున్నారు.
ఇటు బీజేపీలో ఈ సారి ఎంపీగా పోటీ చేయని సీనియర్ నేతలతో పాటు చాలా మందికి గవర్నర్ పోస్టులు ఇవ్వాల్సి ఉంది. ఇందులో భాగంగా కేంద్ర మాజీ విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను ఏపీ గవర్నర్‌గా పంపిస్తారని ప్రచారం నడుస్తోంది.
పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత కొత్త గవర్నర్ల నియమాకం ఉండొచ్చని తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే తెలంగాణ గవర్నర్‌గా నరసింహన్ కొనసాగించే అవకాశం ఉంది. లేకపోతే వేరే రాష్ట్రానికి పంపొచ్చని కూడా చెబుతున్నారు. మొత్తానికి త్వరలోనే కొత్త గవర్నర్ల నియమాకం ఉంటుందని మాత్రం తెలుస్తోంది.