జనసేనకు రావెల రాజీనామా
జనసేన పార్టీకి మరో ప్రముఖుడు రాజీనామా చేశాడు. మాజీ ఐఆర్‌ఎస్ అధికారి అయిన రావెల కిషోర్ బాబు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ పై గెలుపొంది చంద్రబాబు ప్రభుత్వంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసి అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. మంత్రి వర్గ విస్తరణలో ఆయనను తన మంత్రి వర్గం నుంచి చంద్రబాబు తప్పించాడు. ఆ తరువాత ఆయన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ప్రయత్నించాడు. ఆ అవకాశం లేకపోవడంతో జనసేన పార్టీలో చేరి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు […]
జనసేన పార్టీకి మరో ప్రముఖుడు రాజీనామా చేశాడు. మాజీ ఐఆర్‌ఎస్ అధికారి అయిన రావెల కిషోర్ బాబు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ పై గెలుపొంది చంద్రబాబు ప్రభుత్వంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసి అనేక వివాదాల్లో చిక్కుకున్నారు.
మంత్రి వర్గ విస్తరణలో ఆయనను తన మంత్రి వర్గం నుంచి చంద్రబాబు తప్పించాడు. ఆ తరువాత ఆయన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ప్రయత్నించాడు.
ఆ అవకాశం లేకపోవడంతో జనసేన పార్టీలో చేరి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్ధిగా పోటీచేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి మేకతోటి సుచరిత చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఆయన 26,371 ఓట్లు మాత్రమే సంపాదించుకోగలిగాడు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పరిస్థితి అగమ్యగోచరంగా ఉండడంతో ఇక ఇక్కడ భవిష్యత్తు లేదనుకుని ఆ పార్టీకి రాజీనామా చేశాడు రావెల కిషోర్‌బాబు.
బీజేపీలో చేరే ఉద్దేశ్యంతో ఆయన రాజీనామా చేశాడని చెబుతున్నప్పటికీ, వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నాడు.