ముచ్చటగా మూడు సంతకాలు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహాన రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ముచ్చటగా మూడు ఫైళ్లపై సంతకాలు చేసారు. సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ మేరకు వారి జీతాలను 3 వేల నుంచి 10 వేల రూపాయాలకు పెంచుతున్న ఫైల్ పై తొలిసంతకం చేసారు. ఇక రెండవ సంతకంగా అనంతపురం ఎక్స్ ప్రెస్ హైవేకి అనుమతి కోరుతూ కేంద్రానికి లేఖ. మూడవ సంతకంగా ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా పరిగణించే జర్నలిస్టుల హెల్త్ కార్డుల […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహాన రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ముచ్చటగా మూడు ఫైళ్లపై సంతకాలు చేసారు. సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ మేరకు వారి జీతాలను 3 వేల నుంచి 10 వేల రూపాయాలకు పెంచుతున్న ఫైల్ పై తొలిసంతకం చేసారు.
ఇక రెండవ సంతకంగా అనంతపురం ఎక్స్ ప్రెస్ హైవేకి అనుమతి కోరుతూ కేంద్రానికి లేఖ.
మూడవ సంతకంగా ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా పరిగణించే జర్నలిస్టుల హెల్త్ కార్డుల రెన్యువల్ ఫైలుపై సంతకం చేసారు.
తాను అన్న మాటకు కట్టుబడి ఉంటానని జగన్మోహాన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజే వెల్లడించారు. మూడు వేల రూపాయల జీతంతో బొటాబొటీగా జీవితాలను వెళ్ళదీస్తున్న ఆశా వర్కర్ల జీతాలను మూడు రెట్లు కంటే ఎక్కువ పెంచడం వారి జీవితాలలో వెలుగును నింపుతుందంటున్నారు.
రెండు రోజుల క్రితం ఆశా వర్కర్ల జీతాలను పెంచుతున్నట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించగానే ఆశా వర్కర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కొన్ని జిల్లాలలో ఆశా వర్కర్లు జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడమే ఇందుకు నిదర్శనం.
ఇక రాయాలసీమ ప్రజల చిరకాల వాంఛ అనంతపురం ఎక్స్ ప్రెస్ వే కోసం కేంద్రానికి లేఖ రాయడం…. రాయాలసీమ వాసుల కోరిక తీరడమే అంటున్నారు. ఈ ఎక్స్ ప్రెస్ వేకు లేఖ రాసి చేతులు దులుపుకోవడం కాకుండా ముఖ్యమంత్రి ఖచ్చితంగా దానిని సాధిస్తారని, అతి త్వరలో కేంద్రం నుంచి అనుమతి తీసుకుని వస్తారని అంటున్నారు.
ప్రజల మంచి చెడ్డలు, ప్రభుత్వ పనితీరు ఎప్పటికప్పడు మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేసే జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత శ్రద్ద కనబరిచారు. నిత్యం మానసిక వత్తిడితోను, అలజడితోను అనారోగ్యం పాలవుతున్న జర్నలిస్టు కుటుంబాలకు ప్రభుత్వ ఖర్చుతో వైద్యసేవలందించే ఫైలుపై సంతకం చేయడం జర్నలిస్టుల కుటుంబాలలో ఆనందాన్ని నింపింది. పైగా ఈ ఇన్యూరెన్స్ పరిమితిని 10 లక్షలకు పెంచారు జగన్.