కొలువుదీరిన మంత్రి వర్గం.... స్పీకర్ గా తమ్మినేని

ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్. జగన్మోహన రెడ్డి ప్రభుత్వం పూర్తి స్దాయిలో కొలువు తీరింది. ఒకేసారి 25 మందికి మంత్రి పదవులు దక్కాయి. ఇన్నాళ్లు తెలుగు రాష్ట్రాలలో విడతలు, విడతలుగా మంత్రి వర్గ విస్తరణ చేపట్టడం అనవాయితి. ఆ సాంప్రదాయాన్ని తోసీరాజని ఒకేసారి 25 మందికి మంత్రి వర్గంలో స్దానం కల్పించారు జగన్మోహన రెడ్డి. ఇంతేకాదు శాసనసభ స్పీకర్, ఛీఫ్ విప్, విఫ్ లను కూడా ప్రకటించారు. మంత్రి వర్గంలో సీనియర్లతో పాటు తొలిసారి ఎన్నికైన వారిలో కొందరికి […]

Advertisement
Update:2019-06-08 07:29 IST

ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్. జగన్మోహన రెడ్డి ప్రభుత్వం పూర్తి స్దాయిలో కొలువు తీరింది. ఒకేసారి 25 మందికి మంత్రి పదవులు దక్కాయి. ఇన్నాళ్లు తెలుగు రాష్ట్రాలలో విడతలు, విడతలుగా మంత్రి వర్గ విస్తరణ చేపట్టడం అనవాయితి. ఆ సాంప్రదాయాన్ని తోసీరాజని ఒకేసారి 25 మందికి మంత్రి వర్గంలో స్దానం కల్పించారు జగన్మోహన రెడ్డి. ఇంతేకాదు శాసనసభ స్పీకర్, ఛీఫ్ విప్, విఫ్ లను కూడా ప్రకటించారు. మంత్రి వర్గంలో సీనియర్లతో పాటు తొలిసారి ఎన్నికైన వారిలో కొందరికి అవకాశం ఇచ్చారు జగన్మోహన రెడ్డి. మంత్రి పదవులు పొందినవారు….

1. ధర్మాన కృష్ణదాస్‌ (పోలినాటి వెలమ–బీసీ)– శ్రీకాకుళం
2. బొత్స సత్యనారాయణ (తూర్పు కాపు–బీసీ)– విజయనగరం
3. పాముల పుష్పశ్రీవాణి (ఎస్టీ)– విజయనగరం
4. అవంతి శ్రీనివాస్‌ (కాపు)–విశాఖపట్నం
5. పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ (శెట్టిబలిజ–బీసీ)– తూర్పు గోదావరి
6. కురసాల కన్నబాబు (కాపు)– తూర్పు గోదావరి
7. పినిపె విశ్వరూప్‌ (ఎస్సీ–మాల)– తూర్పు గోదావరి
8. ఆళ్ల నాని (కాపు)– పశ్చిమ గోదావరి
9. తానేటి వనిత (ఎస్సీ–మాదిగ)– పశ్చిమ గోదావరి
10. చెరుకువాడ శ్రీరంగనాథరాజు(క్షత్రియ– పశ్చిమ గోదావరి
11. వెల్లంపల్లి శ్రీనివాస్‌ (వైశ్య)– కృష్ణా
12. కొడాలి నాని (కమ్మ)– కృష్ణా
13. పేర్ని నాని (కాపు)– కృష్ణా
14. మేకతోటి సుచరిత (ఎస్సీ–మాల)– గుంటూరు
15. మోపిదేవి వెంకటరమణారావు (మత్స్యకారుడు–బీసీ)– గుంటూరు
16.బాలినేని శ్రీనివాసరెడ్డి (రెడ్డి)– ప్రకాశం
17. ఆదిమూలపు సురేష్‌ (ఎస్సీ–మాదిగ)– ప్రకాశం
18.పాలుబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్‌ (యాదవ–బీసీ)– పీఎస్సార్‌ నెల్లూరు
19. మేకపాటి గౌతమ్‌రెడ్డి (రెడ్డి)– పీఎస్సార్‌ నెల్లూరు
20. షేక్‌ బేపారి అంజాద్‌ బాషా(ముస్లిం–బీసీ)– వైఎస్సార్‌ జిల్లా
21. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (రెడ్డి)– చిత్తూరు
22. కళత్తూరు నారాయణస్వామి (ఎస్సీ–మాల)– చిత్తూరు
23. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (రెడ్డి)– కర్నూలు
24. గుమ్మనూరు జయరామ్‌ (బోయ–బీసీ)– కర్నూలు
25. మాలగుండ్ల శంకరనారాయణ (కురుబ–బీసీ)– అనంతపురం.

స్పీకర్ గా తమ్మినేని…. చీఫ్ విప్ గా శ్రీకాంత్ రెడ్డి ఆరుసార్లు శాసన సభ్యుడిగా, సమైక్య రాష్ట్రంలో మంత్రిగా విశేషానుభవం ఉన్న ఉత్తరాంధ్ర నాయకుడు తమ్మినేని సీతారామ్ కు స్పీకర్ పదవి ఇచ్చారు జగన్మోహన రెడ్డి. ఈ నిర్ణయం రాజకీయ అనుభవానికి పెద్దపీట వేయడమే కాకుండా కాళింగుల సమాజిక వర్గాన్ని సంతృప్తి పరచడమే అంటున్నారు విశ్లేషకులు.

సామాజిక సమీకరణాలతో మంత్రి కాలేకపోయినా జగన్మోహన రెడ్డి అనుంగ అనుచరుడు గండికోట శ్రీకాంత రెడ్డికి చీఫ్ విప్ పదవిని ఇచ్చారు. ఇదీ క్యాబినెట్ స్దాయి పదవి. ఇక విప్ లుగా పార్ధసారధి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, కోరమట్ల శ్రీనివాసులు, బూడి ముత్యాల నాయుడు, దాడిశేట్టి రాజాలను నియమించారు.

ఈ పదవుల భర్తీ కూడా సామాజిక కోణాన్ని పరిగణలోకి తీసుకుని ఇచ్చినవేనని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ శాసన సభకు డిప్యూటీ స్పీకర్ గా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన శాసన సభ్యుడిని నియమించే అవకాశం ఉందని అంటున్నారు. పాలనతో పాటు పదవుల పందారంలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అచితూచి అడుగులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News