కాబోయే మంత్రులకు విజయసాయిరెడ్డి ఫోన్
ఏపీలో వైసీపీ శాసనసభాపక్ష సమావేశం శుక్రవారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశం చేసిన జగన్ తన కేబినెట్ లో తొలిసారే 25మందిని మంత్రులుగా తీసుకుంటున్నట్టు ప్రకటించారు. రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళల్లో 90 శాతం మంది తప్పుకుంటే ఆ స్థానంలో కొత్త వాళ్ళకు మరో రెండున్నరేళ్ళపాటు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని జగన్ చెప్పినట్లు సమాచారం. ఇక ఏపీ శాసనసభ స్పీకర్ గా తమ్మినేని సీతారాంను జగన్ ఖాయం చేశారు. వెనుకబడిన […]
ఏపీలో వైసీపీ శాసనసభాపక్ష సమావేశం శుక్రవారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశం చేసిన జగన్ తన కేబినెట్ లో తొలిసారే 25మందిని మంత్రులుగా తీసుకుంటున్నట్టు ప్రకటించారు. రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళల్లో 90 శాతం మంది తప్పుకుంటే ఆ స్థానంలో కొత్త వాళ్ళకు మరో రెండున్నరేళ్ళపాటు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని జగన్ చెప్పినట్లు సమాచారం.
ఇక ఏపీ శాసనసభ స్పీకర్ గా తమ్మినేని సీతారాంను జగన్ ఖాయం చేశారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాకు చెందిన నేత కావడం… 40 ఏళ్ల రాజకీయ అనుభవం, సీనియర్ నేత కావడంతో తమ్మినేనినే జగన్ స్పీకర్ పదవికి ఎంపిక చేశారు. తమ్మినేని సీతారాం ఈసారి ఆముదాలవలస నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఈయనకు అత్యున్నత పదవి కట్టబెట్టారు.
ఇక డిప్యూటీ సీఎంలుగా ఐదుగురిని చేయాలని జగన్ డిసైడ్ అవ్వడం విశేషం.. ఎస్పీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, కాపు వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులను జగన్ కేటాయిస్తున్నారు.
తాజాగా తన కేబినెట్ లోని మొత్తం 25మందిని ఖరారు చేసిన జగన్ తాజాగా నలుగురికి ఫోన్లు చేయించి ప్రమాణ స్వీకారానికి రెడీగా ఉండాలని చెప్పినట్టు తెలిసింది.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నుంచి తాజాగా వైసీపీ సీనియర్ ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణ, సుచరిత, గౌతమ్ రెడ్డి, పెద్దిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, బుగ్గన, కొడాలి నాని, పార్థసారథి లకు ఫోన్లు వెళ్లాయి. వీరంతా మంత్రులుగా ప్రమాణ స్వీకారానికి రెడీగా ఉండాలని కోరినట్లు తెలిసింది. మొదటగా వైఎస్ కేబినెట్ లో నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఖాయమవడం విశేషం.
ఇక హోంమంత్రి పదవిని దళిత మహిళకు కేటాయించడానికి జగన్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే జగన్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.