ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ లో బ్లాక్ బస్టర్ ఫైట్

ఫేవరెట్ నడాల్ కు ఫెదరర్ సవాల్  క్వార్టర్స్ లో నడాల్, ఫెదరర్ విజయాలు వావరింకాపై ఫెదరర్, నిషికోరీ పై నడాల్ గెలుపు 2019 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీస్ లో అతిపెద్ద సమరానికి రంగం సిద్ధమయ్యింది. ఫైనల్లో చోటు కోసం 11సార్లు విజేత రాఫెల్ నడాల్, గ్రాండ్ స్లామ్ కింగ్ రోజర్ ఫెదరర్ ఢీ కొనబోతున్నారు. పారిస్ లోని రోలాండ్ గారోస్ స్టేడియంలో ముగిసిన క్వార్టర్ ఫైనల్స్ లో నడాల్ అలవోక విజయం సాధిస్తే …వెటరన్ ఫెదరర్ […]

Advertisement
Update:2019-06-05 08:05 IST
  • ఫేవరెట్ నడాల్ కు ఫెదరర్ సవాల్
  • క్వార్టర్స్ లో నడాల్, ఫెదరర్ విజయాలు
  • వావరింకాపై ఫెదరర్, నిషికోరీ పై నడాల్ గెలుపు

2019 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీస్ లో అతిపెద్ద సమరానికి రంగం సిద్ధమయ్యింది. ఫైనల్లో చోటు కోసం 11సార్లు విజేత రాఫెల్ నడాల్, గ్రాండ్ స్లామ్ కింగ్ రోజర్ ఫెదరర్ ఢీ కొనబోతున్నారు.

పారిస్ లోని రోలాండ్ గారోస్ స్టేడియంలో ముగిసిన క్వార్టర్ ఫైనల్స్ లో నడాల్ అలవోక విజయం సాధిస్తే …వెటరన్ ఫెదరర్ మాత్రం గట్టిపోటీ ఎదుర్కొని విజేతగా నిలిచాడు.

37 ఏళ్ల వయసులో ఫెదరర్ వేట…

స్విస్ కూల్ కూల్ స్టార్ రోజర్ ఫెదరర్ 37 ఏళ్ల వయసులో ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్ చేరిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

క్వార్టర్ ఫైనల్స్ లో తన దేశానికే చెందిన స్టాన్ వావరింకాను నాలుగుసెట్ల పోరులో ఫెదరర్ అధిగమించాడు. ఫెదరర్ 3 గంటల 35 నిముషాల పోరులో కీలక విజయం సాధించాడు. 2015 తర్వాత తొలిసారిగా ఫ్రెంచ్ ఓపెన్ బరిలోకి దిగిన ఫెదరర్…అనూహ్యంగా సెమీస్ బెర్త్ సాధించాడు.

నువ్వానేనా అన్నట్లుగా సాగిన సమరంలో ఫెదరర్ 7-6, 6-4, 7-6, 6-4తో విజేతగా నిలిచాడు. అంతేకాదు…తన కెరియర్ లో గ్రాండ్ స్లామ్ సింగిల్స్ సెమీఫైనల్స్ చేరడం ఫెదరర్ కు ఇది 43వసారి కాగా…ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ చేరడం ఎనిమిదోసారి మాత్రమే.

నడాల్ టాప్ గేర్..

మరోవైపు …రెండోసీడ్, 11సార్లు ఫ్రెంచ్ ఓపెన్ కింగ్ నడాల్ మాత్రం తన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో వీరవిహారం చేశాడు. జపాన్ ఆటగాడు కియా నిషికోరీతో జరిగిన పోటీలో కేవలం గంటా 51 నిముషాలలోనే… నడాల్ 6-1, 6-1, 6-3తో విజయం సాధించాడు. 33 ఏళ్ల నడాల్ ఫైనల్లో చోటు కోసం 37ఏళ్ల ఫెదరర్ తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.

ఫెదరర్ పై నడాల్ దే పైచేయి…

20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్నర్ ఫెదరర్, 17 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత నడాల్…తమ కెరియర్ లో 39వసారి ముఖాముఖీ సమరానికి సై అంటున్నారు. ఫెదరర్ ప్రత్యర్థిగా నడాల్ కు 23-15 రికార్డు ఉంది.

Tags:    
Advertisement

Similar News