కేశినేని నాని రూటు మారిందా?

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని సైకిల్ దిగ‌బోతున్నారా? ఆయ‌న క‌మ‌లం పార్టీలోకి జంప్ అవుతారా? అంటే అవుననే చ‌ర్చ విజ‌య‌వాడ‌లో న‌డుస్తోంది. ముఖ్యంగా తెలుగు త‌మ్ముళ్ల మ‌ధ్య ఈ పాయింట్ డిస్క‌ష‌న్ న‌డుస్తోంది. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత నుంచి బీజేపీ నేత‌ల‌తో నాని వ‌రుస‌గా భేటీ అవుతున్నారు. ఇప్ప‌టికే కేంద్ర ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్కరీని ఆయ‌న క‌లిశారు. గ‌డ్క‌రీతో ఉన్న అనుబంధం గురించి ట్వీట్ చేశారు. ఆయ‌న స‌హ‌కారంతో ప‌లు ప్రాజెక్టుల‌ను ముందుకు […]

Advertisement
Update:2019-06-04 04:49 IST

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని సైకిల్ దిగ‌బోతున్నారా? ఆయ‌న క‌మ‌లం పార్టీలోకి జంప్ అవుతారా? అంటే అవుననే చ‌ర్చ విజ‌య‌వాడ‌లో న‌డుస్తోంది. ముఖ్యంగా తెలుగు త‌మ్ముళ్ల మ‌ధ్య ఈ పాయింట్ డిస్క‌ష‌న్ న‌డుస్తోంది.

ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత నుంచి బీజేపీ నేత‌ల‌తో నాని వ‌రుస‌గా భేటీ అవుతున్నారు. ఇప్ప‌టికే కేంద్ర ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్కరీని ఆయ‌న క‌లిశారు. గ‌డ్క‌రీతో ఉన్న అనుబంధం గురించి ట్వీట్ చేశారు. ఆయ‌న స‌హ‌కారంతో ప‌లు ప్రాజెక్టుల‌ను ముందుకు తీసుకుపోయినట్లు చెప్పారు.

అంతేకాకుండా ఈ మ‌ధ్య గౌత‌మ్ స‌వాంగ్‌ను డీజీపీగా నియ‌మించినందుకు కేశినేని నాని ప్ర‌శంసించారు. నిజాయితీ గ‌ల ఆఫీస‌ర్ డీజీపీగా ఉండ‌డం అవ‌సర‌మ‌ని కొనియాడారు. ఇంత‌కుముందు టీడీపీ ప్ర‌భుత్వంలో కూడా తాను ఈయ‌న పేరు సూచించిన‌ట్లు చెప్పారు. అయితే అప్పుడు చంద్ర‌బాబు ఠాకూర్ వైపు మొగ్గుచూపిన‌ట్లు చెబుతున్నారు.

విజ‌య‌వాడ ఎంపీగా ఎన్నికైన త‌ర్వాత నుంచి నాని బీజేపీ నేత‌ల‌తో మంచి సంబంధాలు మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. ఢిల్లీలో త‌న‌కంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు టీడీపీ ప్ర‌భుత్వం లేక‌పోవ‌డంతో బీజేపీకి ద‌గ్గ‌ర‌వుతార‌ని బెజవాడ త‌మ్ముళ్లు గుస‌గుస‌లాడుకుంటున్నారు. నాని సంగతేంటి? అని చ‌ర్చించుకుంటున్నారు.

విజ‌య‌వాడ ఏ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో టీడీపీ పార్టీ త‌ర‌పున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు, లోకేష్ పాల్గొన్నారు. కానీ ఈ విందుకు ఎంపీ కేశినేని నాని హాజ‌రుకాక‌పోవ‌డం చర్చనీయాంశంగా మారింది. నాని ఢిల్లీలోనే ఉన్నార‌ని తెలుస్తోంది.

విజ‌య‌వాడ ఎంపీ సీటు ప‌రిధిలో విజ‌య‌వాడ ఈస్ట్‌లో మాత్ర‌మే టీడీపీ గెలిచింది. మిగ‌తా ఆరు నియోజ‌క‌వర్గాల్లో ఓడిపోయింది. కానీ లోక్‌స‌భ సీటు వచ్చేవ‌ర‌కూ నాని ఇమేజ్ క్రాస్ ఓటింగ్‌కు కార‌ణ‌మైంది. అసెంబ్లీలో 39 శాతం ఓట్లు మాత్ర‌మే టీడీపీ సాధిస్తే…. ఎంపీగా 45 శాతం ఓట్లను నాని సంపాదించారు. దీంతో నానికి బెజ‌వాడ‌లో ఉన్న ఆద‌ర‌ణ తెలుస్తోంది.

విజ‌య‌వాడ లాంటి న‌గ‌రంతో పాటు కృష్ణా జిల్లాలో ప‌ట్టు సాధించాలంటే నాని లాంటి లీడ‌ర్ కావాల‌ని బీజేపీ ఆలోచిస్తోంద‌ట‌. మొత్తానికి బీజేపీకి కేశినేని నాని ద‌గ్గ‌ర‌వుతున్న సంకేతాలు మాత్రం క‌న్పిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News