అన్ని వర్గాలకూ పదవులు దక్కేలా....
ఏపీ నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక జగన్ దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఇక 8న మంత్రివర్గ విస్తరణ, 12న అసెంబ్లీ సమావేశాలను ఐదు రోజులు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఈ సందర్భంగానే స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్ పదవుల ఎంపికను కూడా చేపడుతారని సమాచారం.. జగన్ ఈసారి పదవుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని తెలిసింది. ముఖ్యంగా సామాజిక కోణంలో పదవుల భర్తీ చేపడుతున్నారట.. దళితులు, అణగారిన వర్గాలు , మహిళలకు కీలక స్థానం ఇవ్వాలని […]
ఏపీ నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక జగన్ దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఇక 8న మంత్రివర్గ విస్తరణ, 12న అసెంబ్లీ సమావేశాలను ఐదు రోజులు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఈ సందర్భంగానే స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్ పదవుల ఎంపికను కూడా చేపడుతారని సమాచారం..
జగన్ ఈసారి పదవుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని తెలిసింది. ముఖ్యంగా సామాజిక కోణంలో పదవుల భర్తీ చేపడుతున్నారట.. దళితులు, అణగారిన వర్గాలు , మహిళలకు కీలక స్థానం ఇవ్వాలని డిసైడ్ అయినట్టు సమాచారం.
రాయలసీమ నుంచి గెలిచిన జగన్ అత్యున్నత సీఎం పదవిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర నేతకే స్పీకర్ పదవి కట్టబెట్టాలని జగన్ నిర్ణయించుకున్నట్టు వైసీపీ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి గెలిచిన వైసీపీ సీనియర్ నేతలు ధర్మానా, తమ్మినేనిలలో ఒకరికి స్పీకర్ పదవి ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రతిబా భారతి తర్వాత స్పీకర్ పదవి శ్రీకాకుళం జిల్లాకు దక్కుతుండడం విశేషంగా మారింది.
ఇక ప్రధానంగా స్పీకర్ రేసులో రోజా పేరు కూడా వినిపించింది. అయితే ఆమె కూడా రాయలసీమ నుంచే గెలవడం.. పైగా రెడ్డి సామాజికవర్గం కావడంతో జగన్ వెనక్కి తగ్గినట్టు సమాచారం. సీఎం రెడ్డి, స్పీకర్ రెడ్డి అయితే తప్పుడు సంకేతాలు వెలువడుతాయని జగన్ రోజాను డ్రాప్ చేసినట్టు తెలిసింది. దీంతో రోజాకు మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోంది.