గవర్నర్ సమక్షంలో రాజ్ భవన్‌లో కేసీఆర్, జగన్ తొలి భేటీ
ఏపీ, తెలంగాణలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత తొలి సారిగా ఇవాళ రాజ్‌భవన్‌లో గవర్నర్ నర్సింహ్మన్‌తో సీఎంలు కేసీఆర్, జగన్‌లు భేటీ అయ్యారు. గవర్నర్ ఇవాళ ఇఫ్తార్ విందు ఇస్తుండటంతో అక్కడికి చేరుకున్న ఇరు రాష్ట్రాల సీఎంలు అంతకు ముందే గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించినట్లు తెలుస్తోంది. పునర్విభజన చట్టంలోని కొన్ని అంశాలపై గత ఐదేండ్లుగా వివాదాలు నెలకొన్నాయి. విభజన చట్టంలోని 9,10 షెడ్యూల్లోని అంశాలతో […]
ఏపీ, తెలంగాణలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత తొలి సారిగా ఇవాళ రాజ్‌భవన్‌లో గవర్నర్ నర్సింహ్మన్‌తో సీఎంలు కేసీఆర్, జగన్‌లు భేటీ అయ్యారు. గవర్నర్ ఇవాళ ఇఫ్తార్ విందు ఇస్తుండటంతో అక్కడికి చేరుకున్న ఇరు రాష్ట్రాల సీఎంలు అంతకు ముందే గవర్నర్‌తో భేటీ అయ్యారు.
ఉమ్మడి రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించినట్లు తెలుస్తోంది. పునర్విభజన చట్టంలోని కొన్ని అంశాలపై గత ఐదేండ్లుగా వివాదాలు నెలకొన్నాయి. విభజన చట్టంలోని 9,10 షెడ్యూల్లోని అంశాలతో పాటు హైదరాబాద్‌లోని ఉమ్మడి ఆస్తుల పంపిణీ, భవనాల అప్పగింత, ఉద్యోగుల విభజన తదితర అంశాలపై వీరు చర్చిస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలోనే ఈ చర్చ జరగాల్సి ఉండగా ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య నెలకొన్న విభేదాల వల్ల ముందుకు కొనసాగలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎం జగన్ తో కేసీఆర్ స్నేహహస్తం చాచడంతో విభజన సమస్యలపై చకచకా చర్చలు జరుగుతున్నాయి.
గవర్నర్ సమక్షంతో జరుగుతున్న సీఎంల తొలి భేటీ కావడంతో అంతా సానుకూల వాతావరణంలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై రాబోయే రోజుల్లో మరిన్ని భేటీలు జరుగనున్నట్లు సమాచారం.