అమ్మో పది రోజులు... ఎండలు మంటలు
ఎండలు మండిపోతున్నాయి. రోహిణి కార్తి ఎండలకు రోళ్లు, రోకళ్లే కాదు మనుషులు కూడా పత్తికాయల్లా పేలిపోతున్నారు. తెల్లవారు ఝామునే 35 డిగ్రీల ఉష్టోగ్రత నమోదు అవుతోంది. ఉదయం 9 గంటలకు ఆ ఉష్టోగ్రత 40 డిగ్రీలకు చేరుకుంటోంది. ఇక మధ్యాహ్న సమయానికి కొన్ని చోట్ల 45 డిగ్రీలు, మరికొన్ని చోట్ల 47 డిగ్రీలకు చేరుకుంటోంది. వేడిగాలులకు తోడు ఉక్కపోత కూడా తెలుగు ప్రజలను ఇబ్బంది పెడుతోంది. మరో పదిరోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని… ఉదయం పదకొండు […]
ఎండలు మండిపోతున్నాయి. రోహిణి కార్తి ఎండలకు రోళ్లు, రోకళ్లే కాదు మనుషులు కూడా పత్తికాయల్లా పేలిపోతున్నారు. తెల్లవారు ఝామునే 35 డిగ్రీల ఉష్టోగ్రత నమోదు అవుతోంది.
ఉదయం 9 గంటలకు ఆ ఉష్టోగ్రత 40 డిగ్రీలకు చేరుకుంటోంది. ఇక మధ్యాహ్న సమయానికి కొన్ని చోట్ల 45 డిగ్రీలు, మరికొన్ని చోట్ల 47 డిగ్రీలకు చేరుకుంటోంది. వేడిగాలులకు తోడు ఉక్కపోత కూడా తెలుగు ప్రజలను ఇబ్బంది పెడుతోంది.
మరో పదిరోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని… ఉదయం పదకొండు గంటల తర్వాత వీలున్నంత వరకూ బయటకి రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలలోని నగరాలు, పట్టణాలే కాదు గ్రామాలలోని రోడ్లన్ని జనసంచారం లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో వడదెబ్బ తగిలి వందల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు.
ఇటీవల తెలుగు రాష్ట్రాలలో సంభంవించిన తుఫానుల ప్రభావం కూడా ఈ ఉష్టోగ్రతలకు కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. శ్రీలంక దగ్గరలో ప్రారంభమైన అల్పపీడనం కూడా ఈ వేసవి తాపానికి కారణమని వాతావరణ అధికారులు అంటున్నారు.
ఈ కారణాల వల్ల వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉన్నదని అంటున్నారు. రానున్న పదిరోజులు సాధ్యమైనంత వరకూ ఎండకు దూరంగా ఉండి, వడగాడ్పులు తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.