ఫ్రెంచ్ ఓపెన్ మూడోరౌండ్లో ఫెదరర్, నడాల్

15వసారి ఫ్రెంచ్ ఓపెన్ మూడోరౌండ్లో గ్రాండ్ స్లామ్ కింగ్  అలవోకగా మూడో రౌండ్లో స్పానిష్ బుల్ ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో సీడెడ్ స్టార్ల దూకుడు కొనసాగుతోంది. 11 సార్లు విజేత రాఫెల్ నడాల్, 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్నర్ రోజర్ ఫెదరర్ అలవోకగా రెండోరౌండ్ విజయాలతో మూడోరౌండ్ కు చేరుకొన్నారు. రోలాండ్ గారోస్ బ్రాండ్ న్యూ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ పురుషుల సింగిల్స్ రెండోరౌండ్లో మాజీ చాంపియన్ రోజర్ ఫెదరర్.. ప్రపంచ 144వ […]

Advertisement
Update:2019-05-30 03:20 IST
  • 15వసారి ఫ్రెంచ్ ఓపెన్ మూడోరౌండ్లో గ్రాండ్ స్లామ్ కింగ్
  • అలవోకగా మూడో రౌండ్లో స్పానిష్ బుల్

ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో సీడెడ్ స్టార్ల దూకుడు కొనసాగుతోంది. 11 సార్లు విజేత రాఫెల్ నడాల్, 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్నర్ రోజర్ ఫెదరర్ అలవోకగా రెండోరౌండ్ విజయాలతో మూడోరౌండ్ కు చేరుకొన్నారు.

రోలాండ్ గారోస్ బ్రాండ్ న్యూ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ పురుషుల సింగిల్స్ రెండోరౌండ్లో మాజీ చాంపియన్ రోజర్ ఫెదరర్.. ప్రపంచ 144వ ర్యాంకర్ ఆస్కార్ ఓట్టేను వరుస సెట్లలో 6-4, 6-3, 6-4తో అధిగమించాడు.

1999 నుంచి ఫ్రెంచ్ ఓపెన్లో పాల్గొంటూ వస్తున్న 37 ఏళ్ల ఫెదరర్ మూడోరౌండ్ చేరడం ఇది 15వసారి కావడం విశేషం. నాలుగోరౌండ్లో చోటు కోసం జరిగే మూడో రౌండ్ పోటీలో…నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్ తో తలపడతాడు.

రఫా రెప రెప…

మరోవైపు…ఫ్రెంచ్ ఓపెన్ 12వ టైటిల్ వేటలో దూసుకుపోతున్న రెండో సీడ్ రాఫెల్ నడాల్…తన రెండో రౌండ్ మ్యాచ్ లో…జర్మన్ ఆటగాడు యానిక్ మాడెన్ ను 6-1, 6-2, 6-4తో చిత్తు చేసి మూడోరౌండ్ చేరాడు.

ఫ్రెంచ్ ఓపెన్లో ఇప్పటి వరకూ 90 సింగిల్స్ మ్యాచ్ లు ఆడిన నడాల్ కు రెండంటే రెండు పరాజయాలు మాత్రమే ఉండటం ఓ అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది.

నాలుగోరౌండ్లో చోటు కోసం జరిగే పోటీలో బెల్జియం ఆటగాడు, 27వ సీడ్ డేవిడ్ గోఫిన్ తో నడాల్ ఢీ కొంటాడు.

Tags:    
Advertisement

Similar News