హాట్ కేకుల్లా వన్డే ప్రపంచకప్ టికెట్లు

లక్ష టికెట్లు కొన్న మహిళా అభిమానులు మే 30 నుంచి జులై 14 వరకూ 2019 ప్రపంచకప్  ప్రపంచకప్ మ్యాచ్ లకు 2 లక్షలమంది హాజరయ్యే అవకాశం క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ వేదికగా ఐదోసారి జరుగనున్న ఐసీసీ 12వ వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లకు రికార్డుస్థాయిలో అభిమానులు హాజరుకావడం తథ్యమని నిర్వాహక సంఘం భావిస్తోంది. మే 30 నుంచి జులై 14 వరకూ ఆరువారాలపాటు జరిగే ఈ టోర్నీలో పది దేశాలకు చెందిన జట్లు ఢీ కొనబోతున్నాయి. ఇంగ్లండ్ […]

Advertisement
Update:2019-05-30 10:35 IST
  • లక్ష టికెట్లు కొన్న మహిళా అభిమానులు
  • మే 30 నుంచి జులై 14 వరకూ 2019 ప్రపంచకప్
  • ప్రపంచకప్ మ్యాచ్ లకు 2 లక్షలమంది హాజరయ్యే అవకాశం

క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ వేదికగా ఐదోసారి జరుగనున్న ఐసీసీ 12వ వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లకు రికార్డుస్థాయిలో అభిమానులు హాజరుకావడం తథ్యమని నిర్వాహక సంఘం భావిస్తోంది.

మే 30 నుంచి జులై 14 వరకూ ఆరువారాలపాటు జరిగే ఈ టోర్నీలో పది దేశాలకు చెందిన జట్లు ఢీ కొనబోతున్నాయి. ఇంగ్లండ్ అండ్ వేల్స్ లోని 11 క్రికెట్ వేదికల్లో ఈ మ్యాచ్ లు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.

ఇంగ్లండ్ లో క్రికెట్ మ్యాచ్ లకు 5 నుంచి 10 వేల మంది అభిమానులు హాజరైతే…భారీగా తరలివచ్చినట్లు భావిస్తారు.

మహిళలకే లక్షా 10వేల టికెట్లు…

ఐసీసీ వన్డే ప్రపంచకప్ మొత్తం టికెట్లలో లక్షా 10 వేల టికెట్లను కేవలం మహిళలే కొనుగోలు చేయటం విశేషం. 16 ఏళ్ల లోపు వారి కోసం లక్షకు పైగా టికెట్లు కేటాయించారు.

మొత్తం ప్రపంచకప్ మ్యాచ్ లకు రికార్డు స్థాయిలో 2 లక్షల మంది అభిమానులు హాజరుకావడం తథ్యమని నిర్వాహక సంఘం ప్రకటించింది.

భారత అభిమానులు 80 వేలమంది ….

ప్రపంచకప్ మ్యాచ్ లు వీక్షించడానికి ఇప్పటికే భారత్ కు చెందిన అభిమానులు 80వేలకు పైగా టికెట్లు బుక్ చేసుకొన్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ సంఘం తెలిపింది.

ఇంగ్లండ్ గడ్డపై ఐదోసారి జరుగనున్న ఈ ప్రపంచకప్ సరికొత్త రికార్డులు నెలకొల్పడమే కాదు…నిర్వాహక సంఘానికి సైతం లాభాలపంట పండించనుంది.

గత 11 ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో లేనంతగా ప్రస్తుత 2019 ప్రపంచకప్ లో 70 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీగా ఇవ్వనున్నారు.

Tags:    
Advertisement

Similar News