ప్రతిపక్షంలోనూ చంద్రబాబుది రికార్డే....

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన చంద్రబాబు మరో అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకోవడం విశేషం. ఉమ్మడి ఏపీలో 10 ఏళ్లుగా సీఎంగా.. ఆ తర్వాత 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు కొనసాగారు. ఇక విభాజిత ఏపీలో 5 ఏళ్లు సీఎంగా.. ఇప్పుడు 5 ఏళ్లు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. చంద్రబాబు ఉమ్మడి ఏపీలో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ను గద్దెదించి 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఎన్టీఆర్ నుంచి […]

Advertisement
Update:2019-05-30 01:20 IST

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన చంద్రబాబు మరో అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకోవడం విశేషం. ఉమ్మడి ఏపీలో 10 ఏళ్లుగా సీఎంగా.. ఆ తర్వాత 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు కొనసాగారు. ఇక విభాజిత ఏపీలో 5 ఏళ్లు సీఎంగా.. ఇప్పుడు 5 ఏళ్లు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు.

చంద్రబాబు ఉమ్మడి ఏపీలో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ను గద్దెదించి 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఎన్టీఆర్ నుంచి టీడీపీ పగ్గాలు చేపట్టిన బాబు ముఖ్యమంత్రి అయ్యారు. 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ మరోసారి చంద్రబాబు నేతృత్వంలో అధికారంలోకి వచ్చింది.

ఇక 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ముందస్తుకు వెళ్లి చంద్రబాబు ఓడిపోయారు. 9 ఏళ్లు పాలించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 2009లో కూడా టీడీపీ మహాకూటమి కట్టినా ఓడిపోయి ప్రతిపక్షానికే పరిమితమైంది. రెండోసారి వైఎస్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఐదేళ్లు చంద్రబాబు ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. 2004-2014 పదేళ్లు చంద్రబాబు ప్రతిపక్షానికే పరిమితమయ్యాడు. ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిగా చంద్రబాబు పేరున ఈ రికార్డ్ ఉంది.

ఇక విభాజిత ఏపీ రాష్ట్రానికి 2014లో తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రికార్డ్ నెలకొల్పారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఘోర ఓటమితో మరోసారి ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. మరో ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా కొనసాగనున్నారు. ఇది కూడా ఒక రికార్డ్.

వైఎస్ హయాంలో ఐదున్నరేళ్లు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉంటే.. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్నకాలంలో ఐదేళ్లే వైఎస్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇప్పుడు మరో ఐదేళ్లు చంద్రబాబు అత్యధిక సార్లు విపక్షనేతగా ఏపీలో కొనసాగిన నేతగా రికార్డు నెలకొల్పనున్నారు. మొత్తం 15 ఏళ్లు ప్రతిపక్షనేతగా చంద్రబాబు రికార్డు సృష్టించబోతున్నారు.

Tags:    
Advertisement

Similar News