ప్రపంచకప్ లో టాప్ ఫైవ్ స్కోరర్లు
2015 ప్రపంచకప్ లో విండీస్ పై గప్టిల్ 237 నాటౌట్ 2015లో జింబాబ్వే పై క్రిస్ గేల్ 205 పరుగులు 1996లో యూఏఈ పై గ్యారీ కిర్ స్టెన్ 188 నాటౌట్ 1999లో శ్రీలంకపై గంగూలీ 183 పరుగులు 1987లో శ్రీలంకపై వీవ్ రిచర్డ్స్ 181 పరుగులు 1983 ప్రపంచకప్ లో జింబాబ్వే పై కపిల్ 175 నాటౌట్ నాలుగేళ్లకోసారి జరిగే వన్డే ప్రపంచకప్ అంటేనే పరుగుల పండుగ. 1975 ప్రారంభ ప్రపంచకప్ నుంచి 2015 టోర్నీ […]
- 2015 ప్రపంచకప్ లో విండీస్ పై గప్టిల్ 237 నాటౌట్
- 2015లో జింబాబ్వే పై క్రిస్ గేల్ 205 పరుగులు
- 1996లో యూఏఈ పై గ్యారీ కిర్ స్టెన్ 188 నాటౌట్
- 1999లో శ్రీలంకపై గంగూలీ 183 పరుగులు
- 1987లో శ్రీలంకపై వీవ్ రిచర్డ్స్ 181 పరుగులు
- 1983 ప్రపంచకప్ లో జింబాబ్వే పై కపిల్ 175 నాటౌట్
నాలుగేళ్లకోసారి జరిగే వన్డే ప్రపంచకప్ అంటేనే పరుగుల పండుగ. 1975 ప్రారంభ ప్రపంచకప్ నుంచి 2015 టోర్నీ వరకూ జరిగిన మొత్తం 11 ప్రపంచకప్ ల్లో మాస్టర్ సచిన్ తో సహా ఎందరో గొప్పగొప్ప ఆటగాళ్లు తమదైన శైలిలో ముద్రవేసినా… అత్యధిక వ్యక్తిగత స్కోర్లు సాధించడంలో మాత్రం విఫలమయ్యారు.
నాలుగేళ్ల క్రితం ముగిసిన 2015 ఐసీసీ ప్రపంచకప్ లో …న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ సాధించిన 237 పరుగుల నాటౌట్ స్కోరే.. ఇప్పటికి అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలవడం విశేషం.
విండీస్ పై గప్టిల్ విశ్వరూపం…
50 ఓవర్ల వన్డే క్రికెట్లో సెంచరీలు సాధించడం సాధారణ విషయమే . అయితే డబుల్ సెంచరీలు సాధించడం అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటుంది.
2015 ప్రపంచకప్ లో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ డాషింగ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ భారీషాట్లతో విరుచుకుపడి..ఏకంగా 237 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు.
ప్రపంచకప్ చరిత్రలో నాటికీ నేటికీ అదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు కావడం విశేషం.
జింబాబ్వే పై క్రిస్ గేల్ స్పెషల్….
ప్రపంచకప్ చరిత్రలో డబుల్ సెంచరీలు సాధించిన ఇద్దరు ఆటగాళ్లలో విండీస్ సునామీ ఓపెనర్ క్రిస్ గేల్ సైతం ఉన్నాడు. 2015 ప్రపంచకప్ లోనే.. జింబాబ్వే ప్రత్యర్థిగా క్రిస్ గేల్ 205 పరుగులు సాధించాడు.
1996 ప్రపంచకప్ లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో జరిగిన మ్యాచ్ లో అపట్టి సౌతాఫ్రికా ఓపెనర్ గ్యారీ కిర్ స్టెన్… 188 నాటౌట్ స్కోరుతో నిలిచాడు.
ప్రపంచకప్ లో కిర్ స్టెన్ సాధించిన 188 పరుగులే మూడో అతిపెద్ద వ్యక్తిగత స్కోరుగా నమోదయ్యింది.
నాలుగో స్థానంలో సౌరవ్ గంగూలీ…
ప్రపంచకప్ మొదటి ఐదు అత్యధిక వ్యక్తిగత స్కోరర్ల జాబితాలో భారత మాజీ కెప్టెన్ సౌవర్ గంగూలీ నాలుగో స్థానంలో ఉన్నాడు.
1999లో శ్రీలంకపై గంగూలీ 183 పరుగుల స్కోరు సాధించడం ద్వారా… కపిల్ దేవ్ పేరుతో ఉన్న 175 పరుగుల నాటౌట్ స్కోరును అధిగమించాడు.
ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత క్రికెటర్ గా సౌరవ్ గంగూలీ ఇప్పటికీ కొనసాగుతున్నాడు.
వీవ్ రిచర్డ్స్ 181 పరుగులు…
వెస్టిండీస్ మాజీ కెప్టెన్, సూపర్ హిట్టర్ వివియన్ రిచర్డ్స్ .. 1987లో జరిగిన రిలయన్స్ ప్రపంచకప్ లో… శ్రీలంకపై 181 పరుగులు సాధించాడు. ఇదే…ప్రపంచకప్ లో ఐదో అత్యుత్తమ స్కోరుగా రికార్డుల్లో చేరింది.
అంతకు ముందు వరకూ…భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సాధించిన 175 పరుగుల నాటౌట్ స్కోరే …ప్రపంచకప్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉండేది.
1983 ప్రపంచకప్ లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో భారత్ 17 పరుగులకే ఐదు టాపార్డర్ వికెట్లు నష్టపోయి ఎదురీదుతున్న సమయంలో.. క్రీజులోకి వచ్చిన కపిల్…వికెట్ కీపర్ కిర్మాణీతో కలసి హీరోచిత భాగస్వామ్యం నమోదు చేశాడు. 175 పరుగుల నాటౌట్ స్కోరుతో మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు.
గేల్, రోహిత్ లకు భలే చాన్స్..
ప్రస్తుత ప్రపంచకప్ టోర్నీలో…డబుల్ సెంచరీలతో పాటు అత్యధిక వ్యక్తిగత స్కోరుతో రికార్డు నెలకొల్పే అవకాశాలు…ఇంగ్లండ్ ఆటగాళ్లు బెయిర్ స్టో, జోస్ బట్లర్, భారత ఓపెనర్ రోహిత్ శర్మ, కరీబియన్ ఓపెనర్ క్రిస్ గేల్, కివీ ఓపెనర్ మార్టిన్ గప్టిల్, కంగారూ డాషర్ డేవిడ్ వార్నర్ లకు.. పుష్కలంగా ఉన్నాయి.
ఇంగ్లండ్ లోని పిచ్ లు, వాతావరణం..సహకరిస్తే…వన్డే క్రికెట్లో 500 టీమ్ స్కోరుతో పాటు…గప్టిల్ పేరుతో ఉన్న 237 పరుగుల స్కోరు సైతం తెరమరుగయ్యే అవకాశం లేకపోలేదు.