రఘువీరా రాజీనామా.... ఏపీ కాంగ్రెస్ ఖతమేనా?

మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది ఏపీ కాంగ్రెస్ పరిస్థితి. ఇప్పటికే దేశంలో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోవడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీనామా చేసి…. మెట్టు దిగి రావడం లేదు. సోనియా, సీనియర్లు ఎంత నచ్చచెప్పినా తన పంతం వీడడం లేదు. దేశంలోనే కాంగ్రెస్ కు నాయకత్వం లేకుండా పోతున్న వేళ.. ఏపీలో కాంగ్రెస్ ఖేల్ ఖతమైంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే వెంటీలేటర్ పై కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు ఆపార్టీకి పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి గట్టి […]

Advertisement
Update:2019-05-29 13:24 IST

మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది ఏపీ కాంగ్రెస్ పరిస్థితి. ఇప్పటికే దేశంలో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోవడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీనామా చేసి…. మెట్టు దిగి రావడం లేదు. సోనియా, సీనియర్లు ఎంత నచ్చచెప్పినా తన పంతం వీడడం లేదు. దేశంలోనే కాంగ్రెస్ కు నాయకత్వం లేకుండా పోతున్న వేళ.. ఏపీలో కాంగ్రెస్ ఖేల్ ఖతమైంది.

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే వెంటీలేటర్ పై కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు ఆపార్టీకి పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి గట్టి షాక్ ఇచ్చారు. ఆయన ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ పదవికి రఘువీరారెడ్డి రాజీనామా చేశారు. రాష్ట్రంలో పార్టీ బలహీనానికి బాధ్యతగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

అయితే రఘువీరా రాజీనామాపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే రాహుల్ రాజీనామాను వెనక్కి తీసుకునేలా అధిష్టానం ప్రయత్నంలో ఉండడంతో రఘువీరా రాజీనామాను పట్టించుకునే స్థితిలో లేదు. రాహుల్ రాజీనామా ఆమోదం పొందితే.. దేశంలోని అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లు మాజీలు అవుతారు.

Tags:    
Advertisement

Similar News