ప్రపంచకప్ లో నేడు భారత్ తొలి సన్నాహక మ్యాచ్

న్యూజిలాండ్ తో విరాట్ సేన ప్రాక్టీస్ మ్యాచ్  వామప్ మ్యాచ్ లో పాక్ కు అప్ఘనిస్తాన్ షాక్  శ్రీలంకపై సౌతాఫ్రికా భారీ గెలుపు ప్రపంచకప్ ప్రారంభానికి ముందే…సన్నాహక మ్యాచ్ ల్లో సంచలనం నమోదయ్యింది. మరోవైపు…హాట్ ఫేవరెట్ భారత్ నేడు తన తొలివామప్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడనుంది. ఇంగ్లండ్ వేదికగా మే 30 నుంచి జులై 14 వరకూ జరిగే 2019 వన్డే ప్రపంచకప్ సమరానికి సన్నాహకంగా జరిగిన ప్రాక్టీసు మ్యాచ్ లు సంచలనాలతో ప్రారంభమయ్యాయి. ప్రపంచ మాజీ […]

Advertisement
Update:2019-05-25 03:10 IST
  • న్యూజిలాండ్ తో విరాట్ సేన ప్రాక్టీస్ మ్యాచ్
  • వామప్ మ్యాచ్ లో పాక్ కు అప్ఘనిస్తాన్ షాక్
  • శ్రీలంకపై సౌతాఫ్రికా భారీ గెలుపు

ప్రపంచకప్ ప్రారంభానికి ముందే…సన్నాహక మ్యాచ్ ల్లో సంచలనం నమోదయ్యింది. మరోవైపు…హాట్ ఫేవరెట్ భారత్ నేడు తన తొలివామప్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడనుంది.

ఇంగ్లండ్ వేదికగా మే 30 నుంచి జులై 14 వరకూ జరిగే 2019 వన్డే ప్రపంచకప్ సమరానికి సన్నాహకంగా జరిగిన ప్రాక్టీసు మ్యాచ్ లు సంచలనాలతో ప్రారంభమయ్యాయి.

ప్రపంచ మాజీ చాంపియన్ పాకిస్తాన్ తో ముగిసిన వామప్ మ్యాచ్ లో పసికూన అప్ఘనిస్థాన్ 3 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది.

బ్రిస్టల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన పాక్ జట్టు నిర్ణిత 50 ఓవర్లలో 262 పరుగులకే కుప్పకూలింది. బాబర్ అజామ్ 108 బాల్స్ లో 112 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

అప్ఘన్ బౌలర్లలో మహ్మద్ నబీ 3 వికెట్లు, జడ్రాన్, రషీద్ ఖాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

50 ఓవర్లలో 263 పరుగుల లక్ష్యంగా చేజింగ్ కు దిగిన అప్ఘనిస్థాన్ 7 వికెట్ల నష్టానికి ఆఖరి బంతి విజయం సొంతం చేసుకొంది. హష్మతుల్లా షాహీద్ 74 పరుగుల టాప్ స్కోరుతో అప్ఘన్ కు విజయం ఖాయం చేశాడు.

శ్రీలంకపై సౌతాఫ్రికా విజయం

కార్డిఫ్ లోని సోఫియా గార్డెన్స్ వేదికగా జరిగిన మరో సన్నాహక మ్యాచ్ లో ప్రపంచ మాజీ చాంపియన్ శ్రీలంకను సౌతాఫ్రికా 87 పరుగుల తేడాతో చిత్తు చేసింది.

న్యూజిలాండ్ తో భారత్ ఢీ..

కెన్నింగ్ టన్ ఓవల్ వేదికగా ఈరోజు జరిగే తొలిసన్నాహక పోటీలో న్యూజిలాండ్ తో భారత్ తలపడనుంది. రెండో డౌన్ స్థానం కోసం.. ఆల్ రౌండర్లు విజయ్ శంకర్, కేదార్ జాదవ్, స్పెషలిస్ట్ ఓపెనర్ కెఎల్ రాహుల్ పోటీపడుతున్నారు. ఈ మ్యాచ్ లో భారీ స్కోరు నమోదయ్యే అవకాశాలున్నాయి.

జూన్ 5న బ్రిస్టల్ వేదికగా జరిగే ప్రారంభమ్యాచ్ లో సౌతాఫ్రికాతో భారత్ తలపడనున్న సంగతి తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News