టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టిన రోడ్డు రోలర్
అసెంబ్లీ ఎన్నికల్లో ట్రక్కు గుర్తుతో టీఆర్ఎస్ పరేషాన్ అయింది. దాదాపు 20 నుంచి 25 చోట్ల మెజార్టీ తగ్గింది. మరికొన్ని చోట్ల ఓడిపోయింది. ఈ దెబ్బతో ట్రక్కు గుర్తు లేకుండా పార్లమెంట్ ఎన్నికల్లో జాగ్రత్తపడింది. అయితే కొత్తగా వచ్చిన రోడ్డురోలర్ గుర్తు కూడా కారు గుర్తును పోలి ఉండడంతో ఈ సారి భువనగిరి నియోజకవర్గంలో ఓటమి ఎదురైంది. భువనగిరి టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ విజయాన్ని రోడ్డు రోలర్ గుర్తు అడ్డుకుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి […]
అసెంబ్లీ ఎన్నికల్లో ట్రక్కు గుర్తుతో టీఆర్ఎస్ పరేషాన్ అయింది. దాదాపు 20 నుంచి 25 చోట్ల మెజార్టీ తగ్గింది. మరికొన్ని చోట్ల ఓడిపోయింది. ఈ దెబ్బతో ట్రక్కు గుర్తు లేకుండా పార్లమెంట్ ఎన్నికల్లో జాగ్రత్తపడింది. అయితే కొత్తగా వచ్చిన రోడ్డురోలర్ గుర్తు కూడా కారు గుర్తును పోలి ఉండడంతో ఈ సారి భువనగిరి నియోజకవర్గంలో ఓటమి ఎదురైంది.
భువనగిరి టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ విజయాన్ని రోడ్డు రోలర్ గుర్తు అడ్డుకుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేవలం 2519 ఓట్ల తేడా గెలిచారు. మొత్తం 9 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే నడిచింది.
మొత్తం 12,12,631 ఓట్లు పోలయ్యాయి. కోమటిరెడ్డికి 5,32,795 ఓట్లు వచ్చాయి. నర్సయ్యగౌడ్‌కు 5,27,576 ఓట్లు వచ్చాయి. భాజపా అభ్యర్థికి 65,457, సీపీఐ అభ్యర్థికి 28,153 ఓట్లు వచ్చాయి
అయితే ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సింగపాక లింగంకు 27,973 పోలయ్యాయి. ఈ రోడ్డురోలర్ ఇక్కడ టీఆర్ఎస్ విజయాన్ని దెబ్బతీసింది. ఈవీఎంలో పైనుంచి మూడో గుర్తు కారు. కింద నుంచి మూడో గుర్తు రోడ్డురోలర్. దీంతో కొందరు ముసలివాళ్లు… కళ్లు కనిపించని వారు… కింద నుంచి మూడో గుర్తు కారు అనుకుని… అక్కడ మీట నొక్కారు. ఈ రెండు గుర్తులు ఒకేలా కనిపించడంతో కొందరు రోడ్డురోలర్ గుర్తుకు ఓటు వేసినట్లు టీఆర్ఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.