ఆర్టీసీ కార్మికుల చర్చలు విఫలం.. ఏ క్షణమైనా సమ్మె..!

ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ, ఎంప్లాయిస్ యూనియన్‌తో సంస్థ యాజమాన్యం మంగళవారం రాత్రి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కార్మిక సంఘాలు ఉంచిన డిమాండ్లను తక్షణమే నెరవేర్చ లేమని ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు తేల్చి చెప్పడంతో కార్మికులు ఇక ఏక్షణమైనా సమ్మెకు దిగే అవకాశం ఉంది. వేతన సవరణ బకాయిలతో పాటు 27 డిమాండ్లు నెరవేర్చలేదనే కారణంతో ఇప్పటికే జేఏసీ, ఈయూ విడివిడిగా సమ్మె నోటీసులు ఇచ్చాయి. వీటిపై ఎండీ సురేంద్ర బాబు చర్చలు జరిపారు. సంస్థకు […]

Advertisement
Update:2019-05-22 01:50 IST

ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ, ఎంప్లాయిస్ యూనియన్‌తో సంస్థ యాజమాన్యం మంగళవారం రాత్రి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కార్మిక సంఘాలు ఉంచిన డిమాండ్లను తక్షణమే నెరవేర్చ లేమని ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు తేల్చి చెప్పడంతో కార్మికులు ఇక ఏక్షణమైనా సమ్మెకు దిగే అవకాశం ఉంది.

వేతన సవరణ బకాయిలతో పాటు 27 డిమాండ్లు నెరవేర్చలేదనే కారణంతో ఇప్పటికే జేఏసీ, ఈయూ విడివిడిగా సమ్మె నోటీసులు ఇచ్చాయి. వీటిపై ఎండీ సురేంద్ర బాబు చర్చలు జరిపారు. సంస్థకు నిధుల కొరత ఉందని.. ప్రభుత్వం నుంచి డబ్బు అందగానే వేతన సవరణ బకాయిలు తీరుస్తామని హామీ ఇచ్చారు.

కాగా, ఇప్పటికే తమ డిమాండ్లు నెరవేర్చడంలో తీవ్ర జాప్యం జరిగిందని వెంటనే అంగీకరించకపోతే సమ్మెకు దిగుతామని చెప్పారు. కాని ఆర్టీసీ యాజమాన్యం సానుకూలంగా స్పందించలేదు. దీంతో సమ్మె చేయాలని నిర్ణయించుకున్నాయి.

ఇవాళ ఉదయం 11 గంటలకు కార్మిక సంఘాలు భేటీ అయి సమ్మె ప్రారంభ తేదీని నిర్ణయిస్తాయని జేఏసీ నేత దామోదర్ చెప్పారు. ఒక వేళ సమ్మె జరిగితే వేసవి సెలవుల్లో ప్రయాణాలు చేసే వారు తీవ్ర ఇబ్బందులు పడక తప్పదు.

అయితే గురువారం నాడు పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చే సంధి దశలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగతామనడం ప్రజలు హర్షించడం లేదు.

Tags:    
Advertisement

Similar News