మామా అల్లుళ్లు ఓటమి బాటలోనేనా?

ఎన్నికల ప్రచారంలోనూ తనదైన శైలిలో వ్యవహరించిన టీడీపీ అధినేత చంద్రబాబు వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కూడా హిందూ పురంలో విజయం సాధించడం కష్టంగానే ఉందని అంటున్నారు. గతంలో బాలకృష్ణ తరపున హిందూపురంలో పీఏలుగా వ్యవహరించిన వారి మీద తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో ఈసారి ఎన్నికలలో బాలకృష్ణ సతీమణి వసుంధరే అన్ని వ్యవహారాలు చూసుకున్నారని సమాచారం. దీంతో తొలుత బాల కృష్ణకే మొగ్గు కనిపించినప్పటికీ, పోలింగ్ తేదీ నాటికి పరిణామాలు మారిపోయాయని చెబుతున్నారు. పోలింగ్ ముగిసిన తరువాత […]

Advertisement
Update:2019-05-18 22:30 IST

ఎన్నికల ప్రచారంలోనూ తనదైన శైలిలో వ్యవహరించిన టీడీపీ అధినేత చంద్రబాబు వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కూడా హిందూ పురంలో విజయం సాధించడం కష్టంగానే ఉందని అంటున్నారు.

గతంలో బాలకృష్ణ తరపున హిందూపురంలో పీఏలుగా వ్యవహరించిన వారి మీద తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో ఈసారి ఎన్నికలలో బాలకృష్ణ సతీమణి వసుంధరే అన్ని వ్యవహారాలు చూసుకున్నారని సమాచారం. దీంతో తొలుత బాల
కృష్ణకే మొగ్గు కనిపించినప్పటికీ, పోలింగ్ తేదీ నాటికి పరిణామాలు మారిపోయాయని చెబుతున్నారు.

పోలింగ్ ముగిసిన తరువాత బాలకృష్ణకు భయపడి మనదే గెలుపు అని చెప్పిన స్థానిక నేతలు, కార్యకర్తలు ఇప్పుడు మెల్లమెల్లగా అసలు విషయాలను బయట పెడుతున్నారట. చివరి క్షణంలో ఓటర్లు వైస్ఆర్ సీపీ వైపు ఆకర్షితులయ్యారని చెబుతున్నారట. దీంతో బాలకృష్ణతోపాటు, విజయం ఖాయమని భావించిన టీడీపీ వర్గాలు కూడా నివ్వెరపోతున్నాయని అంటున్నారు. విషయం తెలియగానే బాలకృష్ట అందుబాటులో ఉన్న పార్టీ నాయకులను పిలిపించుకుని తాజాగా తిరిగి సమీక్షలు జరిపారని తెలుస్తోంది.

పోలింగ్ కేంద్రాలవారీగా లెక్కలు తెప్పించుకుని గెలుపు అవకాశాలను బేరీజు వేసుకున్నారని చెబుతున్నారు. అటు వైఎస్ఆర్ సీపీ కూడా కీలకమైన ఈ స్థానం నుంచి తమ అభ్యర్థి విజయం సాధిస్తాడని అంచనా వేస్తోంది.

మరోవైపు మంగళగిరి నుంచి రంగంలోకి దిగిన చంద్రబాబు తనయుడు లోకేశ్ బాబు కూడా తనకు ఓటమి తప్పదేమోననే నిర్ణయానికి వచ్చారట. పార్టీకి చెందిన స్థానిక శ్రేణులు తగిన భరోసా ఇవ్వకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.

ముందుగా ఇక్కడ నుంచి పద్మశాలీ సామాజికవర్గానికి చెందినవారికి టికెట్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆ వర్గానికి చెందిన నేతలను తన వద్దకు పిలిపించుకుని మరీ నమ్మకం కలిగించారని, తీరా సమయానికి అక్కడ లోకేశ్ బాబు పోటీకి దిగడంతో వారు కంగు తిన్నారని అంటున్నారు.

ఈ నియోజకవర్గంలో వారి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే అధికంగా ఉన్నారు. తమకు టికెట్ రాకపోవడంతో వారంతా టీడీపీకి వ్యతిరేకంగా పని చేశారని చెబుతున్నారు. అక్కకడక్కడా లోకేశ్ తన ప్రసంగాలలో నోరు జారడం కూడా నష్టం కలిగించిందని అంటున్నారు. దీంతో ఈసారి మామా అల్లుళ్లకు చేదు అనుభవాలు తప్పవని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News