ఏపీలో హంగ్ రాదు.. తెలంగాణలో కారుదే షికారు : లగడపాటి
తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు గెల్చుకోబోతోందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. ఎన్నికల సరళి ఎలా ఉండబోతోందో అనే విషయాన్ని ఇవాళ విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. ఏపీ ప్రజలు ఎప్పుడైనా స్పష్టమైన మెజార్టీనే అందించారని.. అసలు హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశాలే లేవని ఆయ బల్లగుద్ది చెప్పారు. గత ఎన్నికల సరళిని చూసుకున్నా.. ఏపీలో గజిబిజి ఫలితాలు ఎప్పడూ రాలేదని ఆయన గుర్తు […]
తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు గెల్చుకోబోతోందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. ఎన్నికల సరళి ఎలా ఉండబోతోందో అనే విషయాన్ని ఇవాళ విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు.
ఏపీ ప్రజలు ఎప్పుడైనా స్పష్టమైన మెజార్టీనే అందించారని.. అసలు హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశాలే లేవని ఆయ బల్లగుద్ది చెప్పారు. గత ఎన్నికల సరళిని చూసుకున్నా.. ఏపీలో గజిబిజి ఫలితాలు ఎప్పడూ రాలేదని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆర్ఠిక పరిస్థితి బాగుండటంతో వారు కారెక్కారని.. ఏపీలో లోటు బడ్జెట్ కారణంగా వారు సైకిల్ ఎంపిక చేసుకున్నారని పరోక్షంగా తన సర్వే ఫలితాలను వెల్లడించారు.
అయితే జాతీయ సర్వేలు కూడా వైసీపీ అధికారంలోనికి రావడం ఖాయమని చెప్తుంటే.. లగడపాటి మళ్లీ గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సర్వేలా చెప్పడం పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.