ఎండల దెబ్బకు తెలంగాణలో 5,214 మంది ఆసుపత్రుల పాలు

సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. వడగాడ్పుల దెబ్బకు రోజురోజుకూ బాధితులు పెరిగిపోతున్నారు. ఈ నెల 1 నుంచి 14 మధ్య తెలంగాణలో 72 మంది వడగాడ్పుల కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. ఏప్రిల్ నెలలో 98 మంది, మార్చిలో 75 మంది మొత్తంగా ఇప్పటి వరకు 245 మంది వడగాడ్పుల వల్ల అనారోగ్యం పాలయ్యారు. కాగా, ఈ సీజన్లో ఎండల వల్ల వడదెబ్బ, ఇతర అనారోగ్యాల పాలైన 5,214 కేసులు నమోదయ్యాయని ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఈఎంఆర్ఐ) […]

Advertisement
Update:2019-05-18 06:30 IST

సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. వడగాడ్పుల దెబ్బకు రోజురోజుకూ బాధితులు పెరిగిపోతున్నారు. ఈ నెల 1 నుంచి 14 మధ్య తెలంగాణలో 72 మంది వడగాడ్పుల కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. ఏప్రిల్ నెలలో 98 మంది, మార్చిలో 75 మంది మొత్తంగా ఇప్పటి వరకు 245 మంది వడగాడ్పుల వల్ల అనారోగ్యం పాలయ్యారు.

కాగా, ఈ సీజన్లో ఎండల వల్ల వడదెబ్బ, ఇతర అనారోగ్యాల పాలైన 5,214 కేసులు నమోదయ్యాయని ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఈఎంఆర్ఐ) తెలియజేసింది. రికార్డు చేయబడని కాల్స్ ఇంకా చాలా వచ్చాయని.. అవన్నీ వడదెబ్బ బాధితులే అని ఈఎంఆర్ఐ చెప్పింది.

అదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సగటున 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చాలా కేసుల్లో సెలైన్, ఓఆర్ఎస్, తడిగుడ్డ తలపై పెట్టడం ద్వారా బాడీ టెంపరేచర్ తగ్గించొచ్చని.. తద్వారా వడదెబ్బ బాధితులు పెరగకుండా చూడవచ్చని చెప్పారు.

అయితే వడదెబ్బ పరిణామాలు ఎక్కువైతే వాంతులు, ఆయాసం పెరగడం జరుగుతుంది. అలాంటి వారికి సరైన సమయంలో ఐసీయూలో ఉంచి ఆక్సిజన్ అందించడం ద్వారా సాధారణ స్థితికి తీసుకొని రావచ్చని చెప్పారు. గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

కిడ్నీ సమస్యలతో బాధపడేవారు పండ్లు, రసాలు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం ఎక్కువగా తాగవద్దని వైద్యులు చెబుతున్నారు. ఒక వేళ ఆ జబ్బుకు మందులు వాడుతున్నట్లయితే ఈ ఎండాకాలంలో వాడాలా వద్దా అనేది వైద్యులను అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్ని మందుల వల్ల ఈ కాలంలో గుండె నొప్పి వచ్చే అవకాశం ఉంటుందని మ్యాక్స్‌క్యూర్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ ఒకరు చెప్పారు.

Tags:    
Advertisement

Similar News