23 తర్వాత చంద్రబాబు పరిస్థితి ఏమిటో చెప్పిన విజయసాయిరెడ్డి

అధికారంలో ఉంటేనే ఏ పార్టీ అయినా ఐక్యంగా ఉంటుంది. అధికారం పోతే ఎవ్వరూ దగ్గరకు రారు.. ఈ విషయం ఎన్నో సార్లు నిరూపితమైంది. గడిచిన 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఎంతో మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు లాగేశారు. 2019లో వారికి టికెట్లు కూడా ఇవ్వలేదు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలపై గుర్రుగా ఉన్న టీడీపీ నేతలు ఏపీలో ఓడిపోతే ఆయన వెంట ఉంటారంటే కష్టమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాజాగా వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి కూడా ఇదే మాట […]

Advertisement
Update:2019-05-17 11:30 IST

అధికారంలో ఉంటేనే ఏ పార్టీ అయినా ఐక్యంగా ఉంటుంది. అధికారం పోతే ఎవ్వరూ దగ్గరకు రారు.. ఈ విషయం ఎన్నో సార్లు నిరూపితమైంది. గడిచిన 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఎంతో మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు లాగేశారు.

2019లో వారికి టికెట్లు కూడా ఇవ్వలేదు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలపై గుర్రుగా ఉన్న టీడీపీ నేతలు ఏపీలో ఓడిపోతే ఆయన వెంట ఉంటారంటే కష్టమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

తాజాగా వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి కూడా ఇదే మాట చెప్పారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకొని ఆ పార్టీని భ్రష్టు పట్టించిన చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని విమర్శించారు.

టీడీపీని నాశనం చేసినందుకు చంద్రబాబు పై తిరుగుబాటు ఖాయమని .. ఈనెల 23 తర్వాత టీడీపీ ముక్కలవుతుందని అన్నారు.

అందుకే చంద్రబాబు ఈ పరిణామాన్ని ముందుగానే ఊహించి పరువు కాపాడుకోవడం కోసం మహానాడును రద్దు చేసుకున్నాడని…. దీన్ని బట్టి టీడీపీ ఓటమి ఖాయమని ముందే తేటతెల్లమైందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

మే 23 తర్వాత టీడీపీ పార్టీ కనుమరుగు కావడంతో సహా ఎన్నో వింతలు విడ్డూరాలు చోటుచేసుకోబోతున్నాయని…. దీన్ని అందరూ చూస్తారని…. విజయసాయిరెడ్డి ట్వీట్లతో చంద్రబాబును ఎండగట్టారు.

ఏపీలో వైసీపీ గాలి వీచిందని సర్వేలు చెబుతుండడం.. టీడీపీ లో భయం చూశాక ఇప్పటికే చాలా మంది టీడీపీ నేతలు తట్టాబుట్టా సర్దుకుంటున్నారు. వైసీపీ గెలిస్తే ఆ పార్టీలోకి జంప్ చేయడానికి రెడీ అవుతున్నారు.

చంద్రబాబు చూపిన బాటలోనే వైసీపీలో చేరడానికి టీడీపీ నాయకులు సిద్ధమౌతున్నారు. వైసీపీ గెలిచాక ఈ పార్టీలోకి భారీగా వలసలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. దాన్నే విజయసాయిరెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News