డ్రగ్స్ కేసులో ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు..!
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో గత ఏడాది డ్రగ్స్ కేసు కలకలం సృష్టించింది. ఈ కేసును దర్యాప్తు చేసిన అకున్ సభర్వాల్ అనేక కూపీలు లాగారు. ఆ తర్వాత ఆయన వేరే శాఖకు బదిలీ అయినా విచారణ మాత్రం కొనసాగింది. తాజాగా డ్రగ్స్ కేసులో సినీ నటులు, ప్రముఖులకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. డ్రగ్స్ వినియోగం, అమ్మకానికి సంబంధించి 62 మందిని విచారించారు. వీరిలో డ్రగ్స్ పెడ్లర్ల నుంచి సినీ తారల వరకు చాలా మంది […]
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో గత ఏడాది డ్రగ్స్ కేసు కలకలం సృష్టించింది. ఈ కేసును దర్యాప్తు చేసిన అకున్ సభర్వాల్ అనేక కూపీలు లాగారు. ఆ తర్వాత ఆయన వేరే శాఖకు బదిలీ అయినా విచారణ మాత్రం కొనసాగింది. తాజాగా డ్రగ్స్ కేసులో సినీ నటులు, ప్రముఖులకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి.
డ్రగ్స్ వినియోగం, అమ్మకానికి సంబంధించి 62 మందిని విచారించారు. వీరిలో డ్రగ్స్ పెడ్లర్ల నుంచి సినీ తారల వరకు చాలా మంది ఉన్నారు. అది మీడియాలో కూడా చాలా విస్తృతంగా ప్రచారం చేయబడింది. ఈ విచారణకు సంబంధించిన ఆధారాలను అనుసరించి ఎక్సైజ్ శాఖ అభియోగ పత్రాలను సిద్దం చేసింది.
కాగా, గత రెండు రోజులుగా సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. వాటిపై ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. డ్రగ్స్ కేసులో ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని.. ప్రస్తుతం కోర్టకు చార్జ్ షీట్ దాఖలు చేస్తున్నామని వారు చెప్పారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఏ వ్యక్తిని వదిలే ప్రసక్తే లేదని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.