ఉత్తమ్ మార్పు ఖాయమట.... కొత్త చీఫ్ ఇతడేనట....

తెలంగాణలో కాంగ్రెస్ ను ప్రక్షాళన చేయాలని అధిష్టానం అడుగులు వేస్తున్నట్టు సమాచారం. అయితే ఎవరూ నొచ్చుకోకుండా.. కర్రవిరగకుండా.. పాము చావకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. ఉత్తమ్ ను అవమానించకుండానే అతడి నుంచి పగ్గాలు మరో కీలక నేతకు అప్పగించాలని భావిస్తోంది. తెలంగాణలో డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కలలుగన్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ సహా ప్రజాసంఘాలన్నీ కలిసి పోటీచేశాయి. మహాకూటమిని ఏర్పాటు చేసినా కేసీఆర్ ప్రభావం ముందు కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. […]

Advertisement
Update:2019-05-15 06:00 IST

తెలంగాణలో కాంగ్రెస్ ను ప్రక్షాళన చేయాలని అధిష్టానం అడుగులు వేస్తున్నట్టు సమాచారం. అయితే ఎవరూ నొచ్చుకోకుండా.. కర్రవిరగకుండా.. పాము చావకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది.

ఉత్తమ్ ను అవమానించకుండానే అతడి నుంచి పగ్గాలు మరో కీలక నేతకు అప్పగించాలని భావిస్తోంది. తెలంగాణలో డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కలలుగన్నారు.

కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ సహా ప్రజాసంఘాలన్నీ కలిసి పోటీచేశాయి. మహాకూటమిని ఏర్పాటు చేసినా కేసీఆర్ ప్రభావం ముందు కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లోనూ పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ ముందుండి నడిపించడంలో ఫెయిల్ అయ్యాడనే విమర్శ ఉంది. నాయకులను ఏకతాటిపై నడిపించడంలో…. గ్రూపు తగాదాలు పరిష్కరించడంలో ఉత్తమ్ విఫలమయ్యాడు.

మొన్నటికి మొన్న వీహెచ్-నగేష్ లు ధర్నాలో కొట్టుకోవడంతో కాంగ్రెస్ ప్రక్షాళనకే అధిష్టానం నడుం బిగించినట్టు తెలుస్తోంది.

తాజాగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ గాంధీభవన్ లో పిచ్చాపాటి భేటిలో శ్రీధర్ బాబే ఇక బీఫామ్ లు ఇస్తాడని నాయకులతో చెప్పుకొచ్చాడట. దీనికి శ్రీధర్ బాబు పైనుంచి పంపేది నువ్వే కాదా అని సమాధానమిచ్చాడట.

దీన్ని బట్టి కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ పదవినిచ్చి సెంట్రల్ లోకి మార్చి రాష్ట్ర పీసీసీ పగ్గాలు శ్రీధర్ బాబుకు అప్పగిస్తారనే చర్చ కాంగ్రెస్ లో వ్యక్తమవుతోంది.

ఒకవేళ శ్రీధర్ బాబు కాకపోతే కోమటిరెడ్డి బ్రదర్స్, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ల పేర్లు రేసులో ఉన్నాయని అధిష్టానం ముఖ్యులు చెబుతున్నారు. అయితే ఫలితాలు వెలువడే మే 23 తర్వాత ఖచ్చితంగా తెలంగాణ పీసీసీ పగ్గాలు మారడం ఖాయమంటున్నారు.

Tags:    
Advertisement

Similar News