హోదా ఇస్తాం.... జగన్ కు బీజేపీ గాలం

కేంద్రంలో హంగ్ వస్తుందన్న సంకేతాలతో బీజేపీ పార్టీ మిత్రపక్షాల కోసం వెంపర్లాడుతోంది. ఇప్పటికే 21 ప్రాంతీయపార్టీలు కాంగ్రెస్ వెంట నడవడంతో కొత్త మిత్రుల కోసం బీజేపీ గాలం వేస్తోంది. ఇన్నాళ్లు ఒంటరిగా అధికారంలోకి వస్తామని బీరాలు పలికిన బీజేపీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల వైపు చూస్తోంది. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఈసారి అధికారంలోకి రావడం ఖాయమన్న అంచనాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ‘ప్రత్యేక హోదా’ ఇస్తామని చెప్పి తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ స్కెచ్ గీస్తున్నట్టు సమాచారం. […]

Advertisement
Update:2019-05-14 11:26 IST

కేంద్రంలో హంగ్ వస్తుందన్న సంకేతాలతో బీజేపీ పార్టీ మిత్రపక్షాల కోసం వెంపర్లాడుతోంది. ఇప్పటికే 21 ప్రాంతీయపార్టీలు కాంగ్రెస్ వెంట నడవడంతో కొత్త మిత్రుల కోసం బీజేపీ గాలం వేస్తోంది.

ఇన్నాళ్లు ఒంటరిగా అధికారంలోకి వస్తామని బీరాలు పలికిన బీజేపీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల వైపు చూస్తోంది.

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఈసారి అధికారంలోకి రావడం ఖాయమన్న అంచనాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ‘ప్రత్యేక హోదా’ ఇస్తామని చెప్పి తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ స్కెచ్ గీస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే దీనిపై బీజేపీ సీనియర్లు జగన్ కు చూచాయగా సంకేతాలు పంపినట్లు తెలిసింది.

అయితే టీడీపీతో నాలుగేళ్లు కాపురం చేసిన బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టంగా చెప్పింది. ఈ నేపథ్యంలోనే హోదా ఇచ్చిన వారికే తన మద్దతు అని జగన్ స్పష్టం చేశారు. పార్లమెంట్ లో ఆందోళన చేయించారు. రాజీనామాలు చేయించారు.

ఏపీలో 25 సీట్లు ఉండగా.. జగన్ 20 సీట్లు గెలుస్తారనే అంచనా ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడానికి ఆ 20 సీట్లు కీలకమవుతాయి. అందుకే జగన్ కు గాలం వేసే పనిలో బీజేపీ నేతలున్నారు.

ఒడిషాలో నవీన్ పట్నాయక్ తోనూ ఫొని తుఫాన్ సమయంలో మోడీ చర్చలు జరిపారు. ఆ రాష్ట్రానికి హోదా ఇస్తే మద్దతు ఇస్తానని నవీన్ చెప్పాడట.. తుఫాన్ లతో అతలాకుతలమైన రాష్ట్రానికి ఇదే పరిష్కారమన్నారట. జగన్ 20, నవీన్ 20 సీట్లు సాధిస్తే కేంద్రంలో తమకు వేరే మిత్రులు అవసరం లేదని బీజేపీ స్కెచ్ గీస్తున్నట్టు సమాచారం. అయితే జగన్ అయినా నవీన్ పట్నాయక్ అయినా ఫలితాల తర్వాతే ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. అప్పుడు బలాన్ని బట్టి రాజకీయంగా లబ్ధి చేకూరే నిర్ణయం తీసుకుందామని జగన్ యోచిస్తున్నట్టు తెలిసింది.

Tags:    
Advertisement

Similar News