ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై
ఐదు ఫైనల్స్ లో ముంబైకి మూడు టైటిల్స్ ఆరోసారి ఫైనల్లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 12వ సీజన్ ఫైనల్ కు మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ అలవోకగా చేరింది. ఆరో ఫైనల్లో నాలుగో టైటిల్ కు గురిపెట్టింది. 2019 సీజన్లో టేబుల్ టాపర్ గా నిలవడమే కాదు…డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పై మూడుకు మూడు విజయాలతో తిరుగులేని ఆధిపత్యం చాటుకొంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో… డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ కు […]
- ఐదు ఫైనల్స్ లో ముంబైకి మూడు టైటిల్స్
- ఆరోసారి ఫైనల్లో ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 12వ సీజన్ ఫైనల్ కు మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ అలవోకగా చేరింది. ఆరో ఫైనల్లో నాలుగో టైటిల్ కు గురిపెట్టింది.
2019 సీజన్లో టేబుల్ టాపర్ గా నిలవడమే కాదు…డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పై మూడుకు మూడు విజయాలతో తిరుగులేని ఆధిపత్యం చాటుకొంది.
రోహిత్ శర్మ కెప్టెన్సీలో…
డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ కు అత్యంత విజయవంతమైన జట్టుగా రికార్డు ఉంది.
ప్రస్తుత సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో అత్యధిక విజయాలతో టేబుల్ టాపర్ గా నిలిచింది. తొలి క్వాలిఫైయర్ లో చెన్నైని చెపాక్ స్టేడియంలో చిత్తు చేయడం ద్వారా టైటిల్ సమరానికి సిద్ధమయ్యింది.
ఫైనల్లో ముంబై ఆరోసారి….
ఐపీఎల్ గత 12 సీజన్ల చరిత్రలో ఐదుసార్లు ఫైనల్స్ చేరిన ముంబై… గత నాలుగు ఫైనల్స్ లో మూడుసార్లు విజేతగా నిలిచింది.
అంతేకాదు…చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యర్థిగా ఫైనల్లో 2013, 2015 టైటిల్స్ నెగ్గిన రికార్డు సైతం ముంబైకి ఉంది.
సచిన్ మెంటార్ గా…
మాస్టర్ సచిన్ టెండుల్కర్ మెంటార్ గా…శ్రీలంకమాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే ప్రధాన శిక్షకుడిగా ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు.. యువత, అనుభవం ఉన్న ఆటగాళ్ల కలనేతగా ఉంది.
రోహిత్ శర్మ, కిరాన్ పోలార్డ్, డీ కాక్ , మలింగ లాంటి అనుభవం ఉన్న ఆటగాళ్లతో పాటు…సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, చహార్, మార్కండే లాంటి యువఆటగాళ్లతో ముంబై సమతూకంతో…అత్యంత పటిష్టమైన జట్టుగా తయారయ్యింది.
టైటిల్ ఫేవరెట్…
ప్రస్తుత సీజన్లో ఆడిన మొత్తం 15 మ్యాచ్ ల్లో ముంబై జోరును బట్టి చూస్తే… రాజీవ్ ఇంటర్నేషల్ స్టేడియం వేదికగా ఈరోజు జరిగే టైటిల్ సమరంలో హాట్ ఫేవరెట్ గా కనిపిస్తోంది.
టైటిల్ సైతం నెగ్గితే 12వ సీజన్లో జైత్రయాత్ర విజయవంతంగా ముగించినట్లవుతుంది.