ఐపీఎల్ -12 లో నేడే టైటిల్ సమరం

హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా టైటిల్ ఫైట్  ఇటు చెన్నై సూపర్ కింగ్స్…అటు ముంబై ఇండియన్స్  టైటిల్ నెగ్గినజట్టుకు 26 కోట్ల ప్రైజ్ మనీ రన్నర్స్ అప్ జట్టుకు 13 కోట్లు ఐపీఎల్ 12వ సీజన్… ఆఖరాటకు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. సూపర్ సండే టైటిల్ ఫైట్ గా ఈ రోజు జరిగే ఫైనల్లో….మూడుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కు…మాజీ చాంపియన్, ముంబై ఇండియన్స్ సవాల్ విసురుతోంది. రాత్రి 8 […]

Advertisement
Update:2019-05-12 02:50 IST
  • హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా టైటిల్ ఫైట్
  • ఇటు చెన్నై సూపర్ కింగ్స్…అటు ముంబై ఇండియన్స్
  • టైటిల్ నెగ్గినజట్టుకు 26 కోట్ల ప్రైజ్ మనీ
  • రన్నర్స్ అప్ జట్టుకు 13 కోట్లు

ఐపీఎల్ 12వ సీజన్… ఆఖరాటకు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. సూపర్ సండే టైటిల్ ఫైట్ గా ఈ రోజు జరిగే ఫైనల్లో….మూడుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కు…మాజీ చాంపియన్, ముంబై ఇండియన్స్ సవాల్ విసురుతోంది.

రాత్రి 8 గంటలకు ఈ సూపర్ డూపర్ ఫైట్ ప్రారంభమవుతుంది.

ఐపీఎల్ లో సూపర్ క్లైమాక్స్…

దేశవిదేశాలలోని కోట్లాదిమంది అభిమానులను గత ఏడువారాలుగా…కదిపి కుదిపేస్తున్న ఐపీఎల్ 12వ సీజన్…క్లయ్ మాక్స్ మ్యాచ్ కు… హైదరాబాద్ రాజీవ్ స్టేడియంలో కౌండ్ డౌన్ ప్రారంభమయ్యింది.

మరికొద్ది గంటల్లో జరిగే ఈ టైటిల్ ఫైట్ కోసం అభిమానులు ఎక్కడలేని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

ఢీ అంటే ఢీ…

ఐపీఎల్ చరిత్రలో రెండు అత్యంత విజయవంతమైన జట్లు..టైటిల్ ఫైట్ కు సై అంటే సై అంటున్నాయి. మొత్తం 60 మ్యాచ్ ల 2019 సీజన్ టైటిల్ సమరంగా జరిగే ఆఖరి మ్యాచ్ కు డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ … ఢీ అంటే ఢీ అంటున్నాయి.

టేబుల్ టాపర్ ముంబై…

డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ మొత్తం 56 మ్యాచ్ ల సమరంలో…..టేబుల్ టాపర్ గా నిలిచిన ముంబై ఇండియన్స్, రెండోస్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్లే…తిరిగి ఫైనల్లో తలపడబోతున్నాయి.

చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ముగిసిన తొలి క్వాలిఫైయర్ లో….సూపర్ కింగ్స్ పై నెగ్గడం ద్వారా ముంబై ఐదోసారి ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది.

మరోవైపు…విశాఖ ఏసీఏ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో ముగిసిన రెండో క్వాలిఫైయర్ సమరంలో….చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో నెగ్గి వరుసగా రెండోసారి, ఓవరాల్ గా 8వసారి ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకొంది.

చెన్నైపై ముంబై 3-0 రికార్డు…

ప్రస్తుత సీజన్లో… ఈ రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డు చూస్తే….చెన్నై సూపర్ కింగ్స్ పై ముంబైదే పైచేయిగా ఉంది. డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ దశలో రెండుకు రెండుమ్యాచ్ ల్లోనూ… చెన్నై పై ముంబై విజయాలు సాధించింది.

అంతేకాదు … చివరకు తొలి క్వాలిఫైయర్స్ లోనూ సూపర్ కింగ్స్ ను ముంబై చిత్తు చేసి 3-0తో రికార్డు సాధించింది.

సమఉజ్జీల సమరం…

ఇక…సూపర్ సండే టైటిల్ సమరంలో రెండుజట్ల బలాబలాలను బట్టి చూస్తే…సమఉజ్జీల సమరంలా జరగటం ఖాయంగా కనిపిస్తోంది.

ఎనిమిదోసారి ఫైనల్లో ఆడుతున్న అనుభవం, వాట్సన్, రాయుడు, ధోనీ, డూప్లెసిస్, సురేశ్ రైనా, జడేజా, ఇమ్రాన్ తాహీర్,
హర్భజన్ సింగ్ లాంటి సీనియర్ స్టార్ల అపార అనుభవం… సూపర్ కింగ్స్ కు అదనపు బలంగా ఉంది. అనుభవమే ఆలంబనగా చెన్నై సమరానికి సై అంటోంది.

మరోవైపు… రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ మాత్రం.. యువ ఆటగాళ్లతో కేరింతలు కొడుతోంది. పదునైన బ్యాటింగ్, చురుకైన ఫీల్డింగ్, సమతూకంతో కూడిన బౌలింగ్ తో అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది.

హైదరాబాద్ రాజీవ్ స్టేడియంలో… ప్రసుత సీజన్లో ముగిసిన మ్యాచ్ ల రికార్డులను బట్టి చూస్తే 180కి పైగా స్కోరు సాధించిన
జట్టుకే విజయావకాశాలు ఉంటాయి.

కప్పు కొడితే 26 కోట్ల ప్రైజ్ మనీ..

ఈరోజు జరిగే టైటిల్ సమరంలో నెగ్గిన జట్టు కోసం ట్రోఫీతో పాటు 26 కోట్ల రూపాయల భారీప్రైజ్ మనీ ఎదురుచూస్తోంది.
విజేతగా నిలిచిన జట్టు కు 26 కోట్లు, రన్నరప్ గా నిలిచిన జట్టుకు 13 కోట్ల రూపాయలు బహుమతిగా ఇస్తారు.

అలుపెరుగని యోధుడు మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ నాలుగోసారి టైటిల్ నెగ్గుతుందా? లేక….ముంబై ఇండియన్స్ మరోసారి విజేతగా నిలుస్తుందా?…తెలుసుకోవాలంటే మాత్రం..మరికొద్దిగంటలపాటు సస్పెన్స్ భరించక తప్పదు.

Tags:    
Advertisement

Similar News