వీహెచ్ రచ్చరచ్చ.... అందరి ముందే ఇలా....

కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు రచ్చరచ్చ చేశారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద శనివారం ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై నిర్వహించిన ధర్నా లో బీభత్సం సృష్టించారు. వేదికపైకి తనను పిలవలేదని…. కుర్చీ ఇవ్వలేదని వీహెచ్ సీరియస్ అయ్యారు. మరో నేత నగేష్ పై వీహెచ్ దాడికి దిగారు. నగేష్ కూడా ప్రతి దాడి చేయడంతో వేదికపైనే ఇద్దరూ కొట్టుకున్నారు. ఈ ధర్నాకి కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ కోదండరాం, ప్రజా సంఘాల నేతలందరూ హాజరయ్యారు. […]

Advertisement
Update:2019-05-11 07:43 IST

కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు రచ్చరచ్చ చేశారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద శనివారం ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై నిర్వహించిన ధర్నా లో బీభత్సం సృష్టించారు. వేదికపైకి తనను పిలవలేదని…. కుర్చీ ఇవ్వలేదని వీహెచ్ సీరియస్ అయ్యారు. మరో నేత నగేష్ పై వీహెచ్ దాడికి దిగారు. నగేష్ కూడా ప్రతి దాడి చేయడంతో వేదికపైనే ఇద్దరూ కొట్టుకున్నారు.

ఈ ధర్నాకి కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ కోదండరాం, ప్రజా సంఘాల నేతలందరూ హాజరయ్యారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై అన్నిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడానికి సిద్ధమైన వేళ వీహెచ్ చేసిన లొల్లితో సమావేశం కాస్త రచ్చరచ్చ అయ్యింది. వీహెచ్ చేసిన పని…. కాంగ్రెస్ పరువుపోయేలా చేసింది.

కాంగ్రెస్ లో పనిచేసిన వారికి గుర్తింపు లేదని వీహెచ్ మండిపడ్డారు. ఇతర పార్టీల వాళ్లను పార్టీలోకి తీసుకొని మన పార్టీ వాళ్లను బయటకు పంపడమేంటని ప్రశ్నించారు. పార్టీని నమ్ముకున్న వారిని గుర్తించరా అని వీహెచ్ విమర్శించారు. తమను అవమానించడం ఏంటని వీహెచ్…. నగేష్ సహా ప్రశ్నించిన వారిపై దాడికి దిగారు. సీనియర్ నేతలు కుంతియా, కోదండరాం, ఎల్ రమణ ముందే వీహెచ్ దాడి చేయడంతో నేతలంతా హతాశులయ్యారు.

కాంగ్రెస్ లో ఒకవర్గం వారికే టికెట్లు ఇస్తున్నారని.. రెడ్లు, వెలమలే అంతా ఏలుతున్నారని.. తన లాంటి బీసీలను గుర్తించడం లేదని వీహెచ్ మండిపడ్డారు. దేశంలో బీసీ సాదికారికత ఎక్కడా లేదని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో టికెట్లను ఏ ప్రాతిపదికన ఇచ్చారని వీహెచ్ ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News